ఇది చూస్తే అబ్బా అనాలిసిందే !

ఈ జంట మధ్య ఉన్న అన్యోన్యతను ప్రియాంక బయటపెడుతూనే ఉంది. క్షణం తీరిక దొరికినా తన భర్త నిక్‌తో షికారుకు చెక్కేస్తుంటుంది. ఇటీవల ఆమె 37 వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తన పుట్టినరోజు వేడుకను భర్తతో కలిసి మయామీలో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. అక్కడ ఓ యాచ్‌లో వీరవిహంగం చేస్తూ సందడి చేశారు. ఈ ట్రిప్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు అందిస్తూనే ఉంది ప్రియాంక. అయితే ఆ యాచ్‌లో పింక్‌ రంగు స్విమ్‌ సూట్‌ వేసుకుని నిక్‌ ఒడిలో పడుకుని ఉండగా, నిక్‌ కాలుని ప్రియాంక పట్టుకున్న ఫొటో ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అయింది. అయితే ఈ బర్త్‌డే సెలబ్రేషన్‌ మాత్రం ఎప్పటికీ మరచిపోలేననీ, నా స్వీట్‌ హార్ట్‌ (నిక్‌) ప్రత్యేకంగా ఈ ట్రీట్‌ ఇచ్చాడనీ, మా సెలబ్రేషన్‌ ఫొటోలు చూస్తే ఎవరైనా హా.. అనాల్సిందేనని ప్రియాంక అంటోంది.