(ధ్యాన్)
సోషల్ మీడియా ద్వారా మంచీ చెడులూ ఉంటాయి. అయితే అవకాశాలు కూడా వస్తాయని ఈ మధ్య అక్కడక్కడా కొందరు చెబుతుంటే తెలుస్తోంది. తాజాగా ఫేస్‌బుక్ ద్వారా సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్ ప్రియా వడ్లమాని. ఈమె నటించిన సినిమా `ప్రేమకు రెయిన్ చెక్`. ఈ సినిమాలో ప్రియా హీరోయిన్. చూడ్డానికి చక్కగా ఉన్న ప్రియతో ఇంటర్వ్యూ…
* ఈ సినిమా గురించి చెప్పండి?
– నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ శరత్ మరార్ సమర్పించారు. స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ట్రెండీ లవ్ స్టోరీ. అభిలాష్ వడాడ, నేనూ కీలక పాత్రలు చేశాం. మౌనికా తవనం ఇంకో నాయిక. సెప్టెంబర్ 7 న విడుదల అవుతుంది.
* మీ గురించి చెప్పండి?
– మాది హైదరాబాద్. మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్ త్రూ ఓ ఆఫర్ వచ్చింది. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాతే `ప్రేమకు రెయిన్ చెక్`లో చేశా.
* మీ పాత్ర ఎలా ఉంటుంది?
– చాలా సైలెంట్ పాత్ర. నా ప్రపంచంలో నేనుంటాను. నేటి తరం అమ్మాయిలకు ప్రతీక.
* అంటే పబ్‌లు, పార్టీలు వంటివి కూడా ఉంటాయా?
– నేటి తరం అమ్మాయిలు అనగానే పబ్‌లకు, పార్టీలకు వెళ్లడమే కాదు.. సహృదయంతోనూ ఉంటారు. కొన్ని విలువలుంటాయి. విదేశాల్లో చదువుకోవాలని ఉన్నా.. తల్లిదండ్రులపై ఆధారపడకుండా చదువుకోవాలని అనుకునే అమ్మాయిగా నటించా.
* నిజ జీవితంలో మీరెలా ఉంటారు?
– కామ్‌గానే ఉంటాను. అడ్వెంచర్స్ అంటే ఇష్టం. ఈ సినిమాలోనూ కొన్ని సాహసాలు చేశా.