షార్ట్ ఫిల్మ్స్ తో దర్శకుడిగా సత్తా చాటిన ప్రశాంత్, వెండితెర మీద కూడా తొలి సినిమా అ!. తోనూ తనదైన ముద్ర వేశాడు. అ! సక్సెస్ సాధించిన ఇప్పుడు కల్కి చిత్రం డైరక్ట్ చేసారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్ , టీజర్స్ చూసిన వారు ఆ సినిమాతో మరో హిట్ కొట్టేటట్లు ఉన్నాడని అంచనా వేస్తున్నారు. కల్కి ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధం అవుతుంది. ఈ చిత్ర ప్రొమోషన్ల లో భాగంగా దర్శకుడు నందమూరి బాలకృష్ణ గురించి ఒక ఇంట్రస్టింగ్ విషయం చెప్పాడు.
ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..“బాలకృష్ణ గారు అద్భుతమైన నటుడు. కేరీర్ ఆరంభంలో ఎన్నో విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేశారు. అయితే ఈ మధ్య ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయారు. ఫ్యాన్స్ వల్ల కావొచ్చు. నా దగ్గర ఆయన కోసం ఒక క్రేజీ స్క్రిప్టు ఉంది. ఇప్పటివరకూ ఆయన చెయ్యనిది. తెలుగు సినిమాలో రానిది. ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చేస్తా,” అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. మొత్తానికి తన నెక్ట్స్ ప్రాజెక్టుకు పెద్ద హీరోకే బాణం వేసాడని ఇండస్ట్రీ అంటోంది. సాధారణంగా యంగ్ డైరక్టర్స్..యంగ్ హీరోలను టార్గెట్ చేస్తూంటారు. కానీ ప్రశాంత్ వర్మ ప్రశాంతంగా ఉంటుందనో ఏమో కానీ ఇలా సీనియర్ హీరోలతో ప్రయాణం పెట్టుకున్నారు.
ఇక బాలయ్య అభిమానులు ఈ సినిమా జరగాలని కోరుకుంటున్నారు. అయితే బాలయ్య ఏమంటారో చూడాలి. బాలయ్య వచ్చే నెలలో తన జైసింహా దర్శకుడు కెఎస్ రవికుమార్ తో ఒక సినిమా మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.