రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన `పవర్ స్టార్` సినిమా గురించి తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున రచ్చ చేసారు. పవన్ ని ఫ్యూచర్ సీఎం అని సినిమాలో పొగుడుతూనే సెటైరికల్ గా కథని నడిపించాడు వర్మ. సినిమా రిలీజ్ కు ముందు.. తర్వాత…ఇప్పటికీ పవన్ అభిమానులు వర్మపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. వర్మ ఒంటరిగా దొరకాలేగానీ! ఏదైనా చేస్తామని హెచ్చరిస్తున్నారు. కానీ వర్మ అంత తెలివి తక్కువవాడా? ఏంటి! ఆ విషయం పక్కనబెడితే ఈ సినిమా గురించి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఏమంటున్నారంటే?
`భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. కానీ అది హద్దు దాటనంత వరకే. అప్పటివరకూ ఎలాంటి ఇబ్బందులు రావు. బోర్డర్ దాటితేనే సమస్యలన్ని మీద పడతాయి. వర్మ తో ఎక్కువగా సినిమాలు చేయలేదు. కానీ వ్యక్తిగతంగా ఆయన్ని చాలాసార్లు కలిసాను. ఆయన అపార మేథావి. ఆయన తెలివి, విజ్ఞానం చాలా గొప్పవి. వర్మ దగ్గర చాలా సమాచారం ఉంటుంది. అలాంటి వ్యక్తిని ఇంత వరకూ ఎక్కడా చూడలేదు. పవన్ కళ్యాణ్ పై ఏదో సినిమా చేసారని తెలిసింది. దాని గురించి కొట్టుకోవడం కన్నా ఇది బెటర్ కదా అని నా ఫీలింగ్ అంటూ` ప్రకాష్ రాజ్ తెలిపారు. మొత్తానికి విలక్షణ నటుడు కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవరించారని తెలుస్తోంది.
వర్మని ఆకాశానికి ఎత్తేస్తూనే..`పవర్ స్టార్` సినిమాని తన భావ ప్రకటనలో భాగంగా తీసారు అన్నట్లు మాట్లాడినట్లు ఉంది. అందుకు అభిమానులు ఆయన పై దాడి చేయడం దేనికి? అన్నట్లే. ప్రకాష్ రాజ్ కూడా ఏ విషయంపైనైనా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. తెలివైన వ్యక్తి. ఉన్న విషయాన్ని నర్మగర్భంగా మాట్లాడేస్తారు. ఇలా మాట్లాడి చాలాసార్లు విమర్శలు మోసారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో తమిళ్ తో పాటు ఇతర భాషల్లో బిజీ అవుతున్నారు.