ప్ర‌దీప్ మాచిరాజు మళ్లీ మొద‌లుపెట్టాలా?

30 Rojullo Preminchadam Ela

ప్ర‌దీప్ మాచిరాజు.. బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌. ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ప్ర‌దీప్ త‌న పేరే వినిపించేలా చేసుకున్నాడు. అయితే బుల్లితెర‌పై క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్ర‌దీప్‌కు వెండితెర‌పై ఆక‌ట్టుకోవాల‌నే ఆశ మొద‌లైంది. దీంలో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అయ్యాడు. `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?` అనే సినిమాతో హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నాడు.

సినిమా అంతా పూర్తియింది. 25న రిలీజ్ అని యాడ్‌లు కూడా ఇచ్చేశారు. కావాల్సినంత ప్ర‌చారం కూడా చేసేశారు. ఇంత‌లో పిడుగులాంటి వార్త క‌రోనా మ‌హ‌మ్మారిలా మారి ప్రాణాల్ని హ‌రిస్తోంద‌ని దీంతో రిలీజ్ ప‌రిస్థితి ఏంట‌ని సందిగ్ధంలో ప‌డిపోయారు చిత్ర నిర్మాత ఎస్వీబాబు.

కరోనా క‌నిక‌రిస్తేనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. లేదంటే మ‌రో రెండు నెల‌లైనా పోస్ట్ పోన్ చేయ‌క త‌ప్ప‌దు. అప్పుడు వ‌చ్చినా ప్ర‌దీప్ మ‌ళ్లీ మొద‌టి నుంచి ప్ర‌చారం మొద‌లుపెట్టాల్సిందే. తొలి సినిమాకే ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్త‌డంతో ప్ర‌దీప్ త‌ల ప‌ట్టుకుంటున్నాడ‌ట‌. అన్న‌ట్టు ఈ చిత్రంలోని `నీలి నీలి ఆకాశం..` ఇప్ప‌టికే యూట్యూబ్‌లో 70 మిలియ‌న్ దవ్యూస్‌ని దాటేసి అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని సాంగ్స్ రికార్డ్ పై క‌న్నేసింది.