మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ , యంగ్‌టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్ లు ప్రస్తుతం జైపూర్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం డిసెంబర్ 30న అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పలువురు సెలబ్రెటీలు హాజరుకానున్నారు. జగపతిబాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్‌తో కార్తికేయ వివాహం జరుగనుంది.
Darling Darling in Jaipur ❤❤
How charming u are #Prabhas pic.twitter.com/vwa9xHch0a
— Ace in Frame-Prabhas (@pubzudarlingye) December 28, 2018
డిసెంబర్ 29న మెహందీ, సంగీత్, డిసెంబర్ 30న పెళ్లి వేడుక జరుగనుంది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగే ఫైవ్ స్టార్ హోటల్ వద్దకు చేరుకోగానే ప్రభాస్ డాన్స్ చేయటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రభాస్‌తో కలిసి రాజమౌళి కూడా స్టెప్పులేయడం విశేషం.
#Bahubali #Prabhas dances in Jaipur. @rpbreakingnews @Namitaskalla @ssrajamouli @tarak9999 #jagapatibabu @FairmontJaipur #RajasthanPatrika @DkDabi pic.twitter.com/sLnx94kpKt
— NamitaSKalla (@Namitaskalla) December 28, 2018