తెలుగులో నటిగా, హీరోయిన్‌గా పూనమ్ కౌర్ మంచి గుర్తింపునే తెచ్చుకుంది. అయితే సినిమాల కంటే ఆమె చేసిన కామెంట్లతో మరింత పాపులర్ అయింది. పవన్ కళ్యాణ్ వ్యవహారంలో కత్తి మహేష్ పూనమ్ కౌర్‌ను లాగడం, వీరిద్దరి మధ్య ఏదో జరిగిందని చెప్పడం, వాటికి కారణం త్రివిక్రమేనని ఆరోపణలు చేయడం అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి పూనమ్ కౌర్ క్రేజ్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో పూనమ్ ఇక ఫుల్ పాపులార్టీ అయింది. మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లపై పరోక్షంగా వేసే ట్వీట్లు రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తూనే ఉంటాయి.
ఆ మధ్య లీడర్, పవర్, ఊగిపోవడం, రెండు బెత్తం దెబ్బలు అంటూ పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేసినట్టుగా పూనమ్ ట్వీట్లు చేసింది. మళ్లీ మధ్యలో గురూజి అంటూ వరుస ట్వీట్లతో నానా రచ్చ చేసింది. ఇక పవన్ కళ్యాణ్‌ను తప్పుదోవ పట్టించింది, కెరీర్ నాశనం కావడానికి కూడా త్రివిక్రమే కారణమన్నట్టుగా పూనమ్ చేసిన ట్వీట్లు చెబుతున్నాయి. తన సినీ కెరీర్‌ను కూడా త్రివిక్రమ్ నాశనం చేశాడని, డిప్రెషన్‌లోకి వెళ్లానని తన జీవితం గురించి చెప్పిన సంగతి తెలిసిందే.
గత కొన్ని రోజులుగా పూనమ్ కౌర్, బిగ్ బాస్ 4కు సంబంధించిన వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ టీంను పూనమ్ సంప్రదించిందని కానీ వారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించలేదని వార్తలు వైరల్ అయ్యాయి. వీటిపై పూనమ్ కౌర్ స్పందిస్తూ.. తానెప్పుడూ వారిని సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది. మొదటి సీజన్ నుంచి వారే సంప్రదిస్తున్నా.. తాను ఒప్పుకోవడం లేదని మరోసారి స్పష్టతనిచ్చింది. ఈ మేరకు తప్పుడు వార్తలు రాసేవారిపై పూనమ్ విరుచుకుపడింది.