మెగాస్టార్ సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్ !

Pooja Hegde ABout South Audience

అల్లు అర్జున్ తో కలిసి నటించిన అలవైకుంఠపురములో సినిమా విజయంతో హీరోయిన్ పూజ హెగ్డే క్రేజ్ ఆకాశాన్ని తాకేలా మరింతగా పెరిగిపోయింది. రెమ్యునరేషన్ భారీగా పెంచినా కూడా నువ్వే కావాలంటూ దర్శక నిర్మాతలు ఆమె డేట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో రామ్ చరణ్ సరసన కూడా నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి

Pooja Hegde in Chiranjeevis movie

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ పూర్తి నిడివి పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర సరసన కథానాయిక కూడా ఉంటుంది. ఇందుకోసం పలువురు భామలను పరిశీలించిన తర్వాత ప్రస్తుతం పూజ హెగ్డే తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

ఇందులో నటించడానికి పూజా కూడా ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం వుంది.ఇదిలాఉంటే .. పూజ హెగ్డే ఇటు తెలుగులో నటిస్తూనే, అటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం అక్కడ కభీ ఈద్ కభీ దివాలి, సర్కస్ చిత్రాలలో నటిస్తోంది.