రవితేజ..గుడ్లగూబ..ఇదేం కాన్సెప్ట్

పివట్ టీజర్ అదే కాన్సెప్టు టీజర్ ని వదలటం ఈ మధ్యకాలంలో ఓ ట్రెండ్ గా మొదలైంది. అయితే ఆ టీజర్ లో సినిమాకు సంభందించిన కాన్సెప్ట్ ఉండేలా చూసుకుంటారు. కానీ అదేంటో గానీ రవితేజ తాజా చిత్రం ‘అమర్‌ అక్బర్ ఆంటోనీ’పివిట్ లో ఏమీ లేదు. కొన్ని సెకన్లు పాటు సాగిన ఈ వీడియోలో రవితేజ మూడు గెటప్ లలో సీరియస్ గా చూస్తూ ఉంటాడు. మొదట్లో ఓ గుబ్లగూబను చూపెట్టడమే కాస్తంత ఆసక్తిగా ఉంది.

అలాగని సస్పెన్స్ బిల్డప్ కాలేదు. ముగ్గరు ఒకరేనా ..లేక ముగ్గురు ఒక పని మీదే తిరుగుతున్నారా అనే విషయం మాత్రం తేల్చలేదు. హీరోయిన్స్ ఊసు అసలే లేదు. ప్రయోగమైనా కమర్షియల్ వెంచరైనా…ఏదో ఒక కాన్సెప్టు ఉంటుంది కదా..దాన్ని చూచాయగా అయినా రివీల్ చేస్తే బాగుండేది అంటున్నారు అభిమానులు.

ఈ చిత్రంలో రవితేజ హిందు, ముస్లిం, క్రిస్టియన్‌ పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.   ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.