(మోహన్ కుమార్)
ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్‌ల హవా నడుస్తుంది. సినీ, రాజకీయ, క్రీడాకారుల జీవితాలను సినిమాల రూపంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో మరో బయోపిక్ తెరకెక్కబోతుంది. అది కూడా ఇండియన్ క్రికెటర్. భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్.. రాజస్థాన్‌లో పుట్టిన మిథాలీ హైదరాబాద్‌లో పెరిగింది. ఈమె బయోపిక్లో ప్రియాంక చోప్రా నటిస్తే బావుంటుందని గతంలో మిథాలీ తెలిపింది. కాగా ప్రియాంక హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఆ కారణంగా మిథాలీ రాజ్ పాత్రలో తాప్సీని నటింప చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. రీసెంట్‌గా సుర్మ సినిమాలో తాప్సీ హాకీ ప్లేయర్‌గా నటించింది. ఇప్పుడు క్రికెటర్‌గా నటించడానికి తాప్సీ ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉంది.