పెంగ్విన్.. మ‌హాన‌టి కీర్తి సురేష్ ఓటీటీ ట్రీట్

కీర్తి సురేష్ న‌టంచిన పెంగ్విన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల ముందుకు జూన్ 19న రాబోతోంది. వాస్త‌వానికి థియేట్రిక‌ల్ రిలీజ్ చేయాల‌ని భావించినా ప్ర‌స్తుతం లాక్ డౌన్ స‌న్నివేశం అందుకు ఆస్కారం ఇవ్వ‌ని సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఈ చిత్రాన్ని ఓటీటీకి విక్ర‌యించారు.

పెంగ్విన్ ఓ గ‌ర్భిణి స్త్రీ పోరాటానికి సంబంధించిన క‌థ‌తో తెర‌కెక్కింది. ఇందులో గ‌ర్భిణిగా కీర్తి సురేష్ న‌టించ‌గా మ‌ర్డ‌ర్ మిస్ట‌రీకి సంబంధించిన పాత్ర‌ల్లో టాప్ పెర్ఫామ‌ర్స్ క‌నిపించ‌నున్నారు. జ్యోతిక `పొన్మగల్ వంధల్` త‌ర్వాత‌ పెంగ్విన్ ఓటీటీపైకి వస్తున్న‌ రెండో సౌత్ మూవీ. మ‌హిళ‌ల‌పై నేరాల్ని ఎలివేట్ చేస్తూ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ‌కు గురి చేస్తుంద‌ట‌.

తాజాగా రిలీజ్ చేసిన టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. ఈనెల 11న ట్రైల‌ర్ రిలీజ్ కానుంది. ఈశ్వ‌ర్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ అండ్ పాషన్ స్టూడియోస్ ప్రొడక్షన్ నిర్మించింది. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాత‌. మ‌హాన‌టి గా గొప్ప ప్ర‌శంస‌లు అందుకున్న కీర్తి గ‌ర్భిణి స్త్రీగా అవార్డులు కురిపించే పాత్ర‌లో న‌టించిందా? అన్న‌ది చూడాలి.

Penguin - Official Teaser | Keerthy Suresh | Karthik Subbaraj | Amazon Prime Video | 19th June