వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కరోనా క్రైసిస్ లోనూ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సమీక్షకుల రేటింగ్ తో విమర్శలతో పనే లేకుండా అతడి ప్రయత్నం సాగుతోంది. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో OTT కంటెంట్‌తో బిజీ అవ్వడమే గాక.. టీవీలు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయిన యువకులను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
అతను నిర్మిస్తున్న తాజా చిత్రం `పవర్ స్టార్. పవన్ కల్యాణ్ పై చిత్రమిది. ఈ సినిమాను వారం క్రితం ఆయన ప్రకటించారు. ఇప్పుడు ప్రీ-ప్రొడక్షన్ కోసం పని చేస్తున్నాడు. వచ్చే వారం షూటింగును ప్రారంభిస్తాడు.
తాజా సమాచారం ప్రకారం.. రామ్ గోపాల్ వర్మ ఒక నెలలోనే సినిమాని పూర్తి చేయనున్నాడట. మొత్తం షూట్ హైదరాబాద్ శివార్లలో జరుగుతుంది. అంతేకాదు.. అతను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. పవన్ పాత్రను పోషించడానికి అతను ఎంచుకున్న టిక్ టాక్ స్టార్ ఫోటోలు ఇంతకుముందు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. పవన్ పై సినిమా తీసే ప్రయత్నం సరికాదంటూ వర్మపై అభిమానుల ట్రోలింగ్ విధితమే.