మొన్న అకిరా.. నేడు మార్క్ శంకర్ పవనోవిచ్

pawan sons

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిల్లలకు కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో క్రేజ్ ఉందని చెప్పవచ్చు. అప్పుడపుడు సోషల్ మీడియాలో వారి హవా భారీ స్టయిలో కనిపిస్తుంది. మిగతా స్టార్స్ పిల్లల ఫొటోలు లీక్ అయితే బజ్ ఎలా ఉంటుందో తెలియదు గాని పవన్ తనయుల ఫొటోలు ఒక్కటి కనిపించినా అవే ట్రెండ్ అవుతుంటాయి.

akira mark

ఇక చాలా రోజుల తరువాత జునియర్ పవర్ స్టార్స్ వారం రోజుల గ్యాప్ లో అభిమానులకు అనుకోకుండా సోషల్ మీడియా ద్వారా దర్శనమిచ్చారు. మొన్న అకిరా అక్క నిహారిక పెళ్లికి వెళ్లిన విషయం తెలిసిందే. పవన్ పెద్దమ్మాయి ఆధ్య కూడా పెళ్లిలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక చిన్న పవర్ స్టార్ నేడు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మాస్క్ తో కనిపించడంతో అందుకు సంబంధించిన ఫొటోలు బాగానే ట్రెండ్ అయ్యాయి.

ఇటీవల రష్యాకు వెళ్లిన పవన్ సతీమణి అన్నా లెజ్‌నేవా మళ్ళీ ఇండియాకు వచ్చేసింది. క్రిస్టమస్ కోసమే ఆమె పుట్టింటికి వెళ్లినట్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ పర్సనల్ రిజన్స్ వల్ల పెళ్లికి హాజరుకాలేదని తెలుస్తోంది. మొత్తానికి ఆమె కూతురు పోలేనా అంజనా పవనోవా, కొడుకు మార్క్ శంకర్ ను వెంట బెట్టుకొని హైదరాబాద్ కు వచ్చింది. ఇక ఎక్కువగా చిన్న పవర్ స్టార్ మార్క్ శంకర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.