దుమ్ము లేపిన పవర్ స్టార్..”జల్సా” తో ఆల్ టైం రికార్డు వసూళ్లు అట..!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హిట్ చిత్రాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేసిన హిట్ సినిమా “జల్సా” ఈ కొన్ని రోజులు నుంచి టాలీవుడ్ లో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. నిన్న సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కావడంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఈ సినిమాని భారీ ఎత్తున స్పెషల్ షో స్ ప్లాన్ చేసుకున్నారు.

అయితే ఈ సినిమా అనుకున్నట్టుగానే భారీ మొత్తంలో షోస్ తో కొత్త ప్రింట్ తో రీ రిలీజ్ చెయ్యగా భారీ రెస్పాన్స్ ఈ సినిమాకి వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెప్పారు. యూఎస్ లో కూడా ఈ సినిమా డబుల్ మార్జిన్ తో రికార్డు బ్రేకింగ్ వసూళ్లు స్పెషల్ షోస్ పరంగా సెట్ చేసినట్టు తెలియగా.. 

ప్రపంచ వ్యాప్తంగా అయితే జల్సా సినిమాకి ఈ స్పెషల్ షోస్ కి గాను 3 కోట్లకి పైగా వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే నైజాం లో ఈ సినిమా 1.25 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా చెబుతున్నారు. దీనితో పవర్ స్టార్ స్పెషల్ షోస్ తో దుమ్ము లేపేసాడని ట్రేడ్ పండితులు అంటున్నారు. మరి స్టార్ట్ అయ్యిన ఈ ట్రెండ్  ఆగుతుందో చూడాలి.