బిగ్ మిస్టేక్ : ఏదైతే చేయ‌కూడ‌దో.. అదే చేసిన పీకే ప్యాన్స్‌..!

featured

మిస్ట‌ర్ వివాదం రామ్ గోపాల్ వ‌ర్మ నుండి వ‌స్తున్న మ‌రో వివాదాస్ప‌ద చిత్రం ప‌వ‌ర్ స్టార్. టైటిల్, పోస్ట‌ర్లు, సాంగ్, ట్రైల‌ర్ ఇలా ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో పెద్ద ర‌చ్చ లేపాడు ఆర్జీవీ. అయితే ఈ వ్య‌వ‌హారంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామ్‌గా ఉన్నా, ఆయ‌న అభిమానులు మాత్రం రెచ్చిపోయి, సోష‌ల్ మీడియ‌లో బూతులు తిడుతూ వార్నింగులు ఇస్తున్నారు. అయితే అవ‌త‌ల ఉంది ఆర్జీవీ క‌దా, ఎవ‌రైనా స‌రే ఐ డోంట్ కేర్ అన్నాడు.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వూలో భాగంగా మాట్లాడుతూ.. పవర్‌స్టార్ ట్రైలర్ విడుదల త‌ర్వాత తనకు బెదిరింపులు పెరిగాయ‌ని, ఈ క్ర‌మంలో తన ఆఫీస్ అడ్రస్ అందరకి తెలుస‌ని, ఎవడు వస్తాడో రండి, అరిచే కుక్క‌లు క‌ర‌వ‌వ‌ని, దీంతో ఇలాంటి బెదిరింపుల‌కు తాను భ‌యపడేది ప్ర‌శ‌క్తే లేదని.. బస్తీమే సవాల్ అంటూ సవాల్ విసిరాడు వ‌ర్మ‌. ప‌వ‌ర్ స్టార్ మూవీ ట్రైల‌ర్‌లో వ‌ర్మ చూపించిన అరాచ‌కానికి మండిపోయి ఉన్న పీకే అభిమానులు, వ‌ర్మ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డంతో, ఏదయితే చేయ‌కూడదో అదే చేశారు ప‌వ‌న్ అభిమానులు.

అప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలోనే అటాక్ చేసిన పీకే అభిమానులు, ఆగ్ర‌హావేల‌తో వ‌ర్మ ఆఫీస్ పై దాడి చేశారు. ఇక్క‌డే పీకే గ్యాంగ్ అన‌వ‌స‌రంగా రెచ్చిపోయి ఆర్జీవీని రెచ్చ‌గొట్టారు. ఇక వ‌ర్మ రెచ్చిపోతే మ‌రో సినిమా తీసినా తీసేస్తాడు. ఇలాంటి త‌ప్పే గ‌తంలో టీడీపీ నేత‌లు చేసిన విష‌యం తెలిసిందే. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విష‌యంలో టీడీపీ త‌మ్ముళ్ళు వ‌ర్మ‌ని ఓ రేంజ్‌లో రెచ్చ‌గొట్టారు. ఏపీలో అయితే సినిమాను విడుద‌ల కూడా కానివ్వ‌లేదు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిలుపుద‌ల‌తో పాటు వ‌ర్మ విజ‌య‌వాడ వెళ్ళ‌గా అత‌న్ని అరెస్ట్ చేశారు.

దీంతో ఒళ్ళుమండి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు అనే సినిమాను తీసి, చంద్ర‌బాబు,లోకేష్ అండ్ టీడీపీ నేత‌ల్ని దారుణంగా చూపించాడు. ఇక లోకేష్‌ని అయితే నిజంగా ఓ ప‌ప్పులా, ఏమి తెలియ‌ని ద‌ద్ద‌మ్మ‌లా చూపించి, సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు విప‌రీతంగా ట్రోల్ చేసుకునేందుకు ఆస్కార‌మిచ్చాడు. అయితే ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ మూవీ విష‌యంలో కూడా, ప‌వన్ అభిమానులు కూడా అదే త‌ప్పు చేస్తున్నారు. దీంతో రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రింత రెచ్చిపోయి మ‌రో సినిమా ప్ర‌క‌టించినా ప్ర‌క‌టించేస్తాడు. ఎందుకంటే వ‌ర్మ తిక్క‌కి అస‌లు లెక్కే ఉండ‌దు, ఇది చాలా మందికి తెలిసిన విష‌య‌మే అయినా, మ‌రి కొంద‌రు తెలుసుకోవాల్సిన విష‌యం.