క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో తెలుగు పరిశ్రమలోని బడాబాబుల చీకటి గుట్టును బయటపెట్టి రచ్చ రచ్చ చేసింది శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా
ఉద్యమం చేపట్టి తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో సంచలనం సృష్టించింది. సినిమాల్లో ఆఫర్స్ ఇప్పిస్తామని..తమ కోరికలు తీర్చుకునే రసిక రాజుల వీడియోలను బయటపెడతానంది. అలాగే తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్థనగ్న ప్రదర్శన చేసింది. ఈ క్రమంలో పలువురు ప్రముఖుల పేర్లు కూడా బయటపెట్టి సంచలనం సృష్టించింది.దాంతో సోషల్ మీడియా అంతా ఆమె ధైర్యానికి సలాం అంది. ఆ క్రమంలో పవన్ పైనా, కత్తి మహేష్ పైనా ఆరోపణలు చేసింది. ఆ తర్వాత పెద్ద గొడవలు అయ్యాయి.
ఆమె పవన్ కళ్యాణ్ ని అన్న పదానికి క్షమాపణ చెప్పాలన్నారు. ఈ వివాదంలో పలు మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆమె నిరసనకు మద్దతు ప్రకటించాయి. వీటిన్నటిలో ఓ డ్రామా కనపడింది తమిళ డైరక్టర్ కు . అంతే ..ఆమె బయోపిక్ తీస్తే బెస్ట్ అనుకున్నాడు. అనుకున్నదే తడువు మొదలెట్టేసాడు. శ్రీరెడ్డి జీవితకథ ఆధారంగా ఓ తమిళ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి `పీవీ 999` అనే టైటిల్ పెట్టారు. కొత్త దర్శకుడు వరదరాజ్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడట. పూర్తిగా కొత్త వాళ్లతోనే ఈ సినిమా తెరకెక్కుతోందట. మరి, ఈ సినిమా సంగతి
ఎలా ఉన్నా..అందులో పవన్, కత్తి మహేష్ ల పాత్రలు ఉంటాయా..ఉంటే వాటిని ఎవరు వేస్తారనేది ఆసక్తికరమైన చర్చగా మారింది.