అందుకే పవన్ కళ్యాణ్ దేవుడు.. ఆ సంగతులు చెప్పిన బండ్లన్న

పవన్ కళ్యాణ్ నా దైవం, అతనే నా దేవుడు అనే ఈ మాటలు ఎంతో మంది అభిమానులు చెబుతుంటారు. కానీ బండ్ల గణేష్ మాత్రం నిత్యం అదే జపిస్తుంటాడు. బండ్లన్న నోటి నుంచి పవన్ కళ్యాణ్ గురించి మాటలు వెలువడితే అవి అభిమానుల గుండెల్లో ఎంతగా నాటుకుపోతాయో అందరికీ తెలిసిందే. ఇక వేదికలు ఎక్కితే పవన్‌ గురించి, ఆయన వ్యక్తిత్తం గురించి అలుపెరగకుండా, గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా మాట్లాడతాడు.

Bandla Ganesh About Shruti Haasan
Bandla Ganesh About Shruti Haasan

తాజాగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి ఓ నిజాన్ని బయటకు చెప్పాడు. ఎందుకు గొప్పవాడు అయ్యాడో అనేందుకు ఓ చిన్న సంఘటను గురించి వివరించాడు. ఇక బండ్లన్న చెప్పిన ఆ మాటలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గబ్బర్ సింగ్ నాటి విశేషాలను బండ్ల గణేష్ చెబుతూ ఎవ్వరికీ తెలియన ఓ సీక్రెట్‌ను తెలిపాడు. గబ్బర్ సింగ్ హీరోయిన్ విషయంలో బండ్ల గణేష్‌ను పవన్‌కు ఓ సలహా ఇచ్చాడట.

బాబు శృతి హాస‌న్ మనకు వద్దు.. అని బండ్లన్న సలహా ఇచ్చాడట. ఎందుకు అని పవన్ అడిగాడట. ఈ అమ్మాయి ఫ్లాపుల్లో ఉంది అందుకే వద్దనుకుంటున్నాను అని బండ్లన్న సమాధానం ఇచ్చాడట. నువ్ ఏమైనా అన్నీ సూపర్ హిట్స్ తీశావారా? అని అనడంతో నోరు మూసుకున్నాడట. అలా ఏ మనిషిని తక్కువగా అంచనా వేయోద్దని పరోక్షంగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నేడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అందుకే పవన్‌ను దేవుడు అని అంటామని ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు.