ఎక్స్ క్లూజివ్‌: ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా చేస్తున్నారు

                                                             (ధ్యాన్)

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు జ‌న‌సేన పార్టీ ప‌నుల‌తో బిజీగా ఉన్నారు. ఓ వైపు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం.. మ‌రోవైపు పార్టీ ప‌నులు.. ఉక్కిరి బిక్కిరిగా ఉన్నారు. ఇలాంటి స‌మయంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా చేస్తారా? అనేది వెయ్యి డాలర్ల ప్ర‌శ్న‌. అయితే ఇప్పుడు ఆ డాల‌ర్లే ఆయ‌న చేత సినిమా చేయిస్తున్నాయి. అంటే ఆయ‌న ప్ర‌స్తుతం సినిమా చేయ‌డానికి ఒప్పుకొన్న‌ది ఓ ఎన్నారైకి. ఆయ‌న మ‌రెవ‌రో కాదు… రామ్ తాళ్లూరి. ఎప్పుడూ ఏ ఆడియో ఫంక్ష‌న్ల‌కూ రావ‌డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ మ‌ధ్య `నేల‌టిక్కెట్‌` సినిమా ఆడియో వేడుక‌కు వ‌చ్చారు. ఆ సినిమా నిర్మాత రామ్ తాళ్లూరి. ఆయ‌న కోస‌మే వ‌చ్చిన‌ట్టు కూడా ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఆయ‌న కోస‌మే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు డాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. డాలీ (కిశోర్ కుమార్ పార్థాసాని)కి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌ధ్య మంచి ర్యాపో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో డాలీ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. బ‌ల్క్ డేట్స్ ఇచ్చారు. ఆ కాల్షీట్ల‌లో ఎన్ని స‌న్నివేశాలు వీలైతే అన్ని స‌న్నివేశాలు తీసుకోవ‌చ్చ‌ని, ప‌గ‌లూ, రేయీ కూడా అందుబాటులో ఉంటాన‌ని నిర్మాత‌కు ప్రామిస్ చేశార‌ట ప‌వ‌న్‌. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ మొద‌ల‌య్యాయి. 

అయితే ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన క‌థానాయ‌కుడా?  ఆయ‌న కాకుంటే ఇంకెవ‌రు ప్ర‌ధాన క‌థానాయ‌కుడు? ఒక‌వేళ మ‌ల్టీస్టార‌ర్ అయితే ఆ మ‌రో హీరో ఎవ‌రు.. వంటి వివ‌రాల కోసం క్లిక్ చేస్తూనే ఉండండి… `తెలుగు రాజ్యం డాట్ కామ్‌`.