స్క్రిప్టు లేనిదే ఏదీ లేదు. కథ కథనం సరిగా కుదరనిదే అసలు సినిమానే లేదు. ఇదీ సూపర్ స్టార్ మహేష్ పంథా. ఆయన ఒక స్క్రిప్ట్ ను లాక్ చేయాలంటే దర్శకుడు ఎన్ని టెస్ట్ లు పాస్ అవ్వాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడి ట్రాక్ రికార్డ్ బావుండాలి. గతంలో బ్లాక్ బస్టర్ కొట్టి ఉండాలి. స్క్రిప్ట్ యూనిక్ గా ఉండాలి.. అందులో కమర్శియల్ అంశాలు పుష్కలంగా ఉండాలి. అందర్నీ కనెక్ట్ చేయగలగాలి. ఈ ప్రాసెస్ అంతా దశలవారిగా జరిగిన తర్వాత అన్నీ కుదిరితే మహేష్ అప్పుడు డైరెక్టర్ ని లాక్ చేసి అధికారికంగా వెల్లడిస్తారు. వీటిలో ఎక్కడ తేడా జరిగినా నిర్మోహమాటంగా అతనితో సినిమా చేయనని చెప్పేస్తాడు. సందీప్ వంగ.. వంశీ పైడిపల్లి విషయంలో ఇదివరకూ ఏం జరిగిందో తెలిసిందే. స్క్రిప్ట్ విన్న తర్వాత కూడా రకరకాల మార్పులు చేయడం… అది నచ్చక మహేష్ మరో దర్శకుడిని అనూహ్యంగా లైన్ లోకి తెచ్చి ఓకే చెప్పేయడం తెలిసిందే.
ఇక మహేష్ విషయంలో వ్యక్తిగతంగా సందీప్ వంగా విసుగెత్తిపోయాడని ఇప్పటికే చాలా కథనాలు వేడెక్కించాయి. అందుకే ఆయన బాలీవుడ్ కి వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేసుకుంటున్నాడని అన్నారు. ఇక అప్పటివరకూ వంశీ పైడిపల్లిని ఊరిస్తూ వచ్చిన మహేష్ చివరిగా అతనికి హ్యాండ్ ఇచ్చి 27వ సినిమా కోసం గీతగోవిందం దర్శకుడు పరశురామ్ ని లైన్ లోకి తెచ్చి స్క్రిప్టును రెడీ చేయిస్తున్నాడు. కొన్ని నెలలుగా ఈ పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకూ మహేష్ ఇంకా ఫైనల్ స్క్రిప్టును లాక్ చేయనేలేదుట. ఇద్దరి మధ్య రకరకాల డిస్కషన్స్ జరిగాయి. స్క్రిప్టులో మార్పులు చెప్పి…మహేష్ కి అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట.
ఇంకా ఫైనల్ కాలేదు అంటే ఇంకా చాలా తంతు ఉండి ఉంటుందని దీనర్థం. మరోసారి పరశురాం పరిపక్వతతో పూర్తి నేరేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు నచ్చితే లాక్ చేస్తాడని..లేదంటే అది కూడా హోల్డ్ లో పడే అవకాశం లేకపోలేదని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే పరశురాం కూడా మిగతా దర్శకుల్లా మహేష్ తో ఇబ్బంది పడినా .. పోరాటం సాగిస్తున్నాడన్న మాట మాత్రం వాస్తవమని అంటున్నారు.