టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందన.’ఛలో’ హిట్ తో అనతి కాలంలో స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్, మహేష్ బాబు సరసన సరసన సరిలేరు నీకెవ్వరులో,నితిన్ తో భీష్మ, అల్లు అర్జన్ 20వ సినిమాలోనూ నటిస్తోంది. అయితే విజయ్ తో గీతాగోవిందంలో నటించడంతో అమ్మడికి మరింత గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులైపోయారు. ఇద్దరి మధ్య ఎదో ఉంది అనే వార్తలు వచ్చాయి. ఆ కారణంగా ప్రేమించిన వాడు రక్షిత్ శెట్టిని దూరం పెట్టింది ఇంకా మనస్పర్థలు వచ్చి విడిపోయారు. మొత్తం వ్వవహారంలో రష్మిక తల్లి సుమన్ మందన పాత్ర అత్యంత కీలకమైనది. రష్మిక పీకల్లోతు బాధలో ఉన్నప్పుడు మీడియాకు వివరణ ఇచ్చింది సుమన్ మందనే. ఆ సమయంలో రష్మిక తండ్రి మదన్ మాత్రం మౌనం వహించారు. ఇదంతా గతం. అయితే తాజాగా రష్మిక వ్వహారిక శైలిపై తండ్రి చాలా సీరియస్ గా ఉన్నాడుట. అందుకు రష్మిక యాట్యుట్యూడే కారణమని ఓ కన్నడ వెబ్ సైట్ల ఓ వార్త వచ్చింది. రష్మిక తల్లి మాట తప్ప! తండ్రి మాట వినదని అందులో రాసారు. తల్లీకూతుళ్లిద్దరు ఒకటిగా తండ్రిని వేరు చేసే ప్రయత్నం చేస్తారని రాసుకొచ్చింది. ఇక డియర్ కామ్రేడ్ లో రష్మి హీరోతో విచ్చల విడిగా పెదవి ముద్దు సన్నివేశాల్లో నటించడంపై మందన్ అసంతృప్తిని వ్యక్తం చేసారుట.