సినీ నిర్మాత, టీఎఫ్ సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు నమోదైంది. నవ్వాడ శోభారాణి అనే మహిళను ఆయన వేధించారంటూ సదరు మహిళ ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసారు. వివరాల్లోకి వెళ్తే ప్రతాని రామకృష్ణ గౌడ్ టీఎఫ్ సీసీ పేరిట ఓ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లగా ఈ అసోసియేషన్ ని మినిస్టర్స్ క్వార్టర్స్ కు ఎదురుగా ఉండే ఓ భవాన్ని అద్దెకు తీసుకుని రన్ చేస్తున్నారు. అక్కడ ఆయన సినిమాకు సంబంధించిన పనులు కూడా జరుగుతుంటాయి. స్ర్కిప్ట్ ఎంపిక చేయడం….దర్శకులతో డిస్కషన్స్, హీరోయిన్ల ఎంపిక, చిన్న చిన్న ఆర్టిస్టుల ఎంపిక జరుగుతుంటుంది. ఆఫీస్ లో ఐదారుగురు సిబ్బంది కూడా ఉంటారు.
అయితే ఆ బిల్డింగ్ శోభారాణి అనే మహిళది. ఆమె నుంచి అద్దుకు తీసుకున్నారు. అడ్వాన్స్ గా 40 లక్షలు, నెల అద్దెగా 4.5 లక్షలకు చెల్లించే అగ్రిమెంట్ చేసుకున్నారుట. 2018 లో ఆ బిల్డింగ్ ను అద్దెకు తీసుకున్నారుట. అయితే అడ్వాన్స్ గా 30 లక్షలిచ్చి, తర్వాత నెల నెల చెల్లించాల్సిన అద్దెను సక్రమంగా చెల్లించాలేదని, ఆ మహిళను లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో శోభారాణి పేర్కొన్నారు. ఓ రోజు నేరుగా ఆమె ఇంటికి వచ్చి అద్దె చెల్లించలేనని, తాళాలు చేతిలో పెట్టి, వేధించినట్లు ఆరోపించారు.
ఆ తర్వాత రామకృష్ణ కుమారుడు సందీప్ దౌర్జన్యంగా తాళాలు పగలుగొట్టి ఇంట్లోకి చొరబడి బెదిరించాడని, ప్రభుత్వ పెద్దలతో పరిచయాలున్నాయని, అద్దె అడిగితే ఏం చేయాలో తనకు తెలిసని బెదిరించినట్లు శోభారాణి తెలిపారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రతాని రామకృష్ణ గౌడుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంచి పరిచయాలున్నాయని అంటుంటారు. ఒకప్పుడు ఇద్దరు మంచి స్నేహితులని, ఇద్దరు వ్యాపార భాగస్వాములని కూడా టాక్ ఉంది.