అనసూయ పేరుతో బూతు వీడియోలు,పోలీసులకు ఫిర్యాదు

అనసూయ పేరుతో బూతు వీడియోలు,పోలీసులకు ఫిర్యాదు

బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మానికి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అన‌సూయ అని ఒప్పుకునే విషయం. అందంతో పాటు చలాకీ మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న అన‌సూయ సోషల్ మీడియాలో కూడా స్పీడుగా ఉంటుంది. రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించిన అన‌సూయ వెండితెరపై న‌ట విశ్వ‌రూపం చూపించిన దగ్గరనుంచి దీంతో అనసూయకు వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ాయి. అంతేకాదు ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ ను అడ్డం పెట్టి బూతు వీడియోలు అప్ లోడ్ చేస్తవన్నారు.

సోషల్ మీడియాలో యాప్‌ల ద్వారా అశ్లీలాన్ని ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసీవ్ యూత్ లీగ్ కార్యదర్శి ప్రదీప్ సీసీఎస్ సైబర్‌క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అనసూయ భరద్వాజ్ యాంకర్ ఫ్యాన్స్ గ్రూపు పేరుతో అచ్చం అందం, తెలుగు బ్యూటీ, ఆంధ్రాపోరీలు అదుర్స్ అంటూ ఫేసుబుక్‌లో గ్రూపులను సృష్టించి బూతు వీడియోలు ప్రత్యక్షంగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో ప్రదీప్ పేర్కొన్నారు.

షేర్ చాట్, విడ్ స్టాటస్, స్టాటస్ వీడియోస్, స్టాటస్ డౌన్ లోడర్ యాప్‌ల ద్వారా సభ్యులను చేర్చుకుంటూ అశ్లీలాన్ని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ అభ్యంతకర పోస్టింగ్‌లను చేస్తున్నవారిని గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రదీప్, కృష్ణ, అంజి, దిలీప్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.