మహేష్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్.. ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ రచ్చ!

చాలా కాలంగా నందమూరి ఫ్యాన్స్ కు మహేష్ బాబు ఫ్యాన్స్ కు మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతూ ఉంది. భరత్ అనే నేను చిత్రం వేడుకలో ఎన్టీఆర్ పాల్గొనడంతో పాటు మేము మేము కలసి ఉంటాం  మంచి స్నేహితులం మీరు ఎందుకు గొడవ పడతారు అంటూ అభిమానులను సున్నితంగా హెచ్చరించాడు . ఆ తర్వాత కూడా పలు సార్లు మహేష్ బాబు ఎన్టీఆర్ లు కలసి పలు పార్టీల్లో పాల్గొనడం ఎంజాయ్ చేయడం జరిగింది. అయినా కూడా ఫ్యాన్స్ మధ్య వైరం మాత్రం అలాగే ఉన్నట్లుగా అనిపిస్తుంది. తాగాజా విజయ్ దేవరకొండ చేసిన ఒక ట్విట్ కు మహేష్ బాబు స్పందించడం జరిగింది. అయితే ఎన్టీఆర్ ఆగష్టు 9న మహేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్ చేయడం జరిగింది. ఆ ట్విట్ మాత్రం మహేష్ రెస్పాన్స్ ఇవ్వలేదు.  

ఇప్పుడు ఈ కారణంతో మహేష్ బాబును నందమూరి ఫ్యాన్స్ టార్గెట్  చేస్తున్నారు. ఒక చెత్త హ్యాష్ ట్యాగ్ తో మహేష్ పరువు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పోస్ట్ చేస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ చేస్తున్న పనికి కౌంటర్ గా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా కొన్ని ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ఈ ఇద్దరు హీరోలు నగిలి పోతున్నారు. ఇద్దరు మంచి స్నేహితులే అయినప్పటికి ఫ్యాన్స్ కారణంగా వీరు శత్రువులు అవుతున్నారు. వారు బాగున్నపుడు ఫ్యాన్స్ కు ఎందుకు ఇలాంటి ఆలోచనలు కలుగుతూన్నాయో వారే నిర్ణయించుకోవాలి.