వైరల్ :”RRR” పై రివ్యూ ఇచ్చిన హాలీవుడ్ భారీ సినిమా రచయిత.!

RRR

మన ఇండియన్ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నో గ్లోబల్ హిట్ చిత్రాల్లో అపారమైన గుర్తింపుని ఇంటర్నేషనల్ వైడ్ తెచ్చుకున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్(RRR) అని చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా చేసిన ఈ సినిమా ఇండియన్ సినిమా నుంచి ఒక బెస్ట్ వర్క్ గా వచ్చింది.

 

అయితే దీని తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 దీనికి మించి ఎక్కువ వసూళ్లు అందుకొని ఉండొచ్చు కానీ RRR కి వచ్చిన గుర్తింపులో సగం కూడా రాలేదని చెప్పాలి. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యాక భారీ ఎత్తున ఓవర్సీస్ ఆడియెన్స్ లో RRR కి భారీ స్థాయి రీచ్ అందింది. మరి లేటెస్ట్ గా అయితే హాలీవుడ్ హిట్ సినిమా డాక్టర్ స్ట్రేంజ్ రచయిత సి రాబర్ట్ కార్గిల్ సాలీడ్ రివ్యూ ని అందించాడు.

తన ఫ్రెండ్స్ ఈ సినిమాని తన దగ్గరకి తీసుకు రాగా ఈ సినిమా చూసాక నేను కూడా వాళ్ళతో సిన్సియర్ గా నిజంగా ఒక మెంబర్ ని అయ్యిపోయాను నేను చూసిన సినిమాల్లో ఇది ఒక మోస్ట్ వియర్డెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ మళ్ళీ ఈవారంలో చాలా సార్లు చూస్తానని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఒరిజినల్ తెలుగు వెర్షన్ ని కూడా తప్పకుండా చూస్తానని చెప్పాడు. దీనితో ఈ పోస్ట్ సెన్సేషన్ ని రేపుతోంది.