గాసిప్స్ : “పుష్ప 2” లో ‘తగ్గదేలే’ కాదు ఇంకో క్రేజీ డైలాగ్ పెడుతున్నారా?ఏంటంటే.. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో సెన్సేషనల్ హిట్ సినిమా “పుష్ప”, తన మరో హ్యాట్రి దర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టగా పాన్ ఇండియా లెవెల్లో తన ఎంట్రీ దద్దరిల్లింది.

అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్స్ కానీ తన డాన్స్ మ్యానరిజం లు ఓ రేంజ్ లో క్లిక్ అయ్యాయి. దీనితో ఇప్పటికీ కూడా పుష్ప హవా సినీ వర్గాల్లో నడుస్తుంది. మరి ఈ చిత్రంలో అల్లు అర్జున్ “తగ్గేదేలే” అని చెప్పే పంచ్ డైలాగ్ ఎంత సెన్సేషన్ అయ్యిందో కూడా అందరికీ తెలిసిందే.

మరి దీనికి అప్ గ్రేడ్ అన్నట్టుగా పుష్ప పార్ట్ లో సుకుమార్ ఇంకో క్రేజీ డైలాగ్ ని రాసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. సుకుమార్ ఈసారి తగ్గేదేలే కాకుండా అల్లు అర్జున్ తో అదే చిత్తూరు స్లాంగ్ లో “కుమ్మేస్తా” అని పెడుతున్నారట. ఇది వినడానికి డిఫరెంట్ గానే ఉంది కానీ క్లిక్ అయ్యేలాగానే అనిపిస్తుంది.

మొత్తానికి అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకి వచ్చింది. ఇంకా ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.