పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నిర్మాత బండ్ల గణేష్ ఓ భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వెల్లడైన సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో ఓ చిత్రాన్ని నిర్మించాలని ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని… ఇందుకోసం ఆయన పవన్‌కు భారీ రెమ్యునరేషన్‌ను కూడా ఆఫరే చేసినట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అక్కడితో ఆగకుండా ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం చేసేస్తున్నారు. అయితే ఈ విషయమై ఈ రోజు బండ్ల గణేశ్ స్పందించారు.
There is no movie finalised in my banner , if there is a movie coming up I will be the first one to announce🙏🏻.
— BANDLA GANESH. (@ganeshbandla) May 29, 2019
తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ పెడుతూ, ఇది నిజం కాదని స్పష్టం చేశారు. తన బ్యానర్ లో ఏ సినిమా కూడా ఇంతవరకూ ఫైనలైజ్ కాలేదన్నారు. ఏదైనా సినిమా ఉంటే మొట్టమొదట అనౌన్స్ చేసేది తానేనని అన్నారు.
ఇదిలా ఉంటే ఎన్నికల్లో పవన్ కళ్యాణ ఓడిపోవడంతో మరో ఐదేళ్ల వరకు ఆయన ఖాళీగా ఉండాల్సిందే. ఈ లోపు యేడాదికి ఒక చిత్రం చొప్పున చేసినా ఐదు చిత్రాలు చేయవచ్చన్నది సినీ ప్రముఖుల అంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం తాను రాజకీయాలకే పరిమితమవుతానని, సినిమాల్లోకి వెళ్లనని ఇప్పటికే స్పష్టంచేశారు.