దేవ‌త‌లు ధీవించ‌గా నితిన్ పెళ్లాడేశాడు

ఎట్ట‌కేల‌కు నితిన్ ఓ ఇంటివాడ‌య్యాడు. తాను వ‌ల‌చిన శాలినిని పెళ్లాడేశాడు. ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు షాలిని మెడలో తాళి కట్టాడు. అందుకు పాత‌బ‌స్తీ లోని ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ వేదిక అయ్యింది. ఈ వివాహం కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో జ‌రిగింది.

ప్ర‌స్తుతం నితిన్ – షాలిని జంట పెళ్లి ఫోటోలు అంత‌ర్జాలంలో రివీల‌య్యాయి. ఈ వివాహానికి సీఎం కేసీఆర్ .. కేటీఆర్ .. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త్రివిక్రమ్ హాజ‌ర‌య్యారా లేదా? అన్న‌దానిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది. ఇంత‌కుముందు ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ వంటి ప్ర‌ముఖులు పెళ్లికొడుకు కార్యక్ర‌మానికి హాజ‌రైన సంగ‌తి విధిత‌మే. ఇక యూత్ స్టార్ కు సామాజిక మాధ్య‌మాల్లో స‌హ‌చ‌రులు స‌హా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

పెళ్లి త‌ర్వాత హ‌నీమూన్ ఎక్క‌డ‌? అన్న‌ది నితిన్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక‌పోతే మ‌హ‌మ్మారీ వ‌ల్ల అనుకున్న రేంజులో డెస్టినేష‌న్ వెడ్డింగ్ కుద‌రలేదు. ఎంతో సింపుల్ గా ఈ వివాహం జ‌రిగింది. త‌దుప‌రి వ‌రుస‌గా సినిమాల్లో న‌టించాల్సి ఉంది. లాక్ డౌన్ ఎత్తేసినా షూటింగుల్లేవ్ కాబ‌ట్టి ఈ స‌మ‌యాన్ని నితిన్ ఫ్యామిలీ లైఫ్ ని జాయ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడ‌నే భావించ‌వ‌చ్చు.

https://twitter.com/actor_nithiin/status/1287485313321844736