తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పురిచ్చి తలైవి జయలలిత జీవితం ఆధారంగా ఆమె బయోపిక్‌ను తమిళ దర్శకురాలు ప్రియదర్శిని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసి ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ రోజు జయలలిత వర్థంతి కావటంతో టీమ్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.
ఈ ఫస్ట్ లుక్‌లో నిత్యామేనన్ జయలలిత పాత్రలో అచ్చు గుద్దినట్లు ఆమెలాగే కన్పిస్తున్నారు. పేపర్‌టేల్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళనాడు ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా ముద్ర వేసుకున్న జయలలిత రాజకీయ, సినీ జీవితాల్లోని ముఖ్య ఘట్టాలన్నీ ఈ చిత్రంలో చూపించనున్నాయని చిత్ర యూనిట్ చెప్తోంది.
కన్నడలో ‘శ్రీశైల మహత్మ్యం’ అనే చిత్రం ద్వారా బాలనటిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన జయ దక్షిణాది భాషల్లో అగ్రహీరోల సరసన నటించి మెప్పించటం..ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం..అనారోగ్యంతో మృతి వరకు దశదశలుగా ఈ చిత్రం కథను చూపించనున్నారు.
మరోపక్క ‘మదరాస పట్టణం’ ఫేమ్ విజయ్ కూడా జయలలితపై బయోపిక్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. నిర్మాత విష్ణు ఇందూరి కూడా జయలలిత మీద ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నానని ఇదివరకే ప్రకటించారు. ఏ ఎల్ విజయ్ తెరెక్కించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాడి ఫ్రిబవరి 24న లాంచ్ కానుంది.