నిఖిల్ ‘అర్జున్‌ సురవరం’ టీజర్ టాక్

డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. తాజాగా అర్జున్ సుర‌వ‌రంగా కనిపించబోతున్నారు. రేసులో కాస్త వెనక బడ్డ నిఖిల్ ఈ చిత్రంతో హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్నలిస్ట్ అర్జున్ సుర‌వ‌రంగా న‌టిస్తున్నారు. గన్ను కంటే పెన్ను గొప్పది అనే కాన్సెప్ట్‌తో జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతుందీ చిత్రం.

‘ఒక అబద్ధాన్ని నిజం చేయడం చాలా ఈజీ. కానీ, ఒక నిజాన్ని నిజమని ప్రూవ్‌ చేయడం చాలా కష్టం. నా పేరు అర్జున్‌ లెనిన్‌ సురవరం.. జనాలకు నిజం చెప్పడం నా ప్రొపెషన్‌’ అంటూ తనని తాను పరిచయం చేసుకుంటున్నారు నిఖిల్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.టీజర్‌ను చూస్తుంటే థ్రిల్లర్ అని అర్దమవుతోంది. ఓ ఇన్విస్టిగేషన్ డ్రామాలా సినిమా నడవబోతోందని అర్దమవుతోంది. ఈ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

Arjun Suravaram Teaser - Nikhil Siddhartha, Lavanya Tripati | T Santhosh | Sam C S

ఇందులో నిఖిల్‌ అర్జున్‌ అనే పాత్రికేయుడిగా నటిస్తున్నారు. మరి అర్జున్‌ ఏ నిజాన్ని బయటపెట్టాడు? అందుకు అతను ఎంచుకున్న మార్గం ఏంటి? ఈ క్రమంలో అతనికి ఏయే సవాళ్లు ఎదురయ్యాయి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మూవీ డైనమిక్‌ ఎల్‌ఎల్‌పీ, ఔరా సినిమా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకం రాజ్‌కుమార్‌ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. బి.మధు సమర్పిస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు న‌టిస్తున్నారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.