సినీ పరిశ్రమలో మోసాలు సహజం. అవకాశాల పేరుతో డబ్బులు గుంజే గ్యాంగ్ లకు కొదవలేదిక్కడ. కళ్ల ముందు సినిమా చూపించి..అటుపై చుక్కలు చూపించే ఘరానా మోసగాళ్లు ఎందరో. కొత్తగా పరిశ్రమకు వచ్చిన వారే వాళ్ల టార్గెట్. 24 శాఖల్లోనూ ఈ విధమైన దొపిడీ పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉంది. ఫ్యాషన్ ని ఆసరాగా చేసుకుని క్యాష్ చేసుకునే చీటర్స్ గురించి నిత్యం వార్తల్లో చదువుతూనే ఉంటాం. పోలీస్ స్టేషన్లలో కుప్పల కొద్ది కేసులు నమోదయ్యాయి. నేటికి వాటికి పరిష్కారం దొరకలేదు.
తాజాగా యంగ్ హీరో నిఖిల్ కూడా వాళ్ల చెరలో చిక్కుకున్న వాడినినేనని బహిరంగం చేసాడు. మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఓ రియాల్టీ షోలో భాగంగా పరిశ్రమలో తన అనుభవాలను చెప్పుకొచ్చాడు. పరిశ్రమకు వచ్చిన కొత్తలో సినిమాల్లో పాత్రలు ఇప్పిస్తామని చెప్పి 5 నుంచి 10 లక్షలు తీసుకుని మోసం చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారన్నాడు. డబ్బు తీనుకున్న తర్వాత వాళ్లు అడ్రస్ కూడా పట్టుకోలేమని చెప్పుకొచ్చాడు. ఓ వ్యక్తి అయితే తనపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించాడుట.
షూటింగ్ కు బ్రేక్ ఇద్దమాని చెప్పి తర్వాత పత్తా లేకుండా పోయాడని నవ్వేసాడు. తన దగ్గర డబ్బులు లేకపోతే ఇంట్లో వాళ్లను అడిగి మరీ ఇచ్చానన్నాడు. పరిశ్రమలో అనుభవం లేకపోల్లే ఇలాంటి తప్పులు చేయాల్సి వచ్చిందని తెలిపాడు. అలాగే కొత్తగా వచ్చే వారికి ఎంత జాగ్రత్తగా ఉండాలో సలహాలు ఇచ్చాడు. ఒక సినిమా మన దగ్గరకు వచ్చిదంటే? ఆ ప్రాజెక్ట్ ఎంత వరకూ నిజమో పూర్తిగా వివరాలు ఆరా తీయాలి. నిజంగా సినిమాలు చేసే నిర్మాతలు గానీ, దర్శకులు గానీ డబ్బులు అడగారు. వాళ్లంతా కేవలం ఫ్యాషన్ తోనే పనిచేస్తారని తెలిపాడు.