సినీ పరిశ్రమలో పోటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకో వడానికి నిరంతరం శ్రమించాలి. అక్కడ జరిగే రాజకీయాలను ఎదుర్కోని నిలబడగలిగాలి. కేవలం ట్యాలెంట్ ఒక్కటే సరిపోదు. ఎత్తుకు పై ఎత్తులు వేయగలగాలి. లేదంటే రేసులో వెనుకబడే ప్రమాదం ఉంది. అలా ఎంతో మంది సెలబ్రిటీలు ట్యాలెంట్ ఉండి కనుమరుగైపోయారు. ఇక వారసుల నుంచి వచ్చే పోటీని తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాళ్లు ఎంట్రీ ఇవ్వనంత కాలం కెరీర్ సాఫీగానే సాగుతోంది. ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయితే ప్రధాన మైన పోటీ వాళ్ల నుంచే ఉంటుంది. పరిశ్రమలో సహజంగానే పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వారిపై బంధుప్రీతి ఉంటుంది. ఆ కాంపిటీషన్ ని తట్టుకోడం ఇంకా కష్టతరమైనది.
తాజాగా తమిళనటి మీరా మిథున్ కోలీవుడ్ లో నెపోటిజం పెట్రేగిపోతుందని కమల్ హాసన్ కుమార్తెను ఉద్దేశించి ఆరోపించింది. మీరా అగ్ని సిరాగుగల్ అనే సినిమాకు హీరోయిన్ గా ఎంపికైందిట. కానీ అనూహ్యంగా మీరాను తప్పించి కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ ని తీసుకున్నారుట. కారణం ఏంటన్నది కూడా చెప్పుకుండా మీరా ని స్కిప్ చేసారుట. దీంతో మీరా కమల్ హాసన్ ఉద్దేశించి..మీరు అనుకున్నది సాధించారు సార్ అంటూ ట్విటర్ లో తన ఆవేదనను వెళ్లగక్కింది. కోలీవుడ్ లో నెపోటిజం ఎక్కువగా ఉందనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలంటూ వాపోయింది.
ఇలా చేసినందకు కమల్, అక్షర్ హాసన్, దర్శకుడు నవీన్ లకు సిగ్గు లేదా? అంటూ ప్రశ్నించింది. ప్రతిభ గల వారిని ఇలాగే తొక్కేస్తున్నారా? అని ఆవేదన చెందింది. సినిమా రంగంలో మాలాంటి వాళ్లు రాణించడం తప్పా! అంటూ ప్రశ్నించింది. అయితే ఈ ఆరోపణలని దర్శకుడు కొట్టి పారేసాడు. వాస్తవానికి మీరా స్థానంలో షాలిని పాండేను తీసుకోవాలనుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల అక్షర హాసన్ తీసుకున్నామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు.