నిహారిక పెళ్లి : “బంగారుకోడి పెట్ట ” సాంగ్ కి చిరు ,సురేఖ డాన్స్

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం మెగా సందడే కనిపిస్తుంది, మెగా ఫామిలీ కి సంబంధించి ఏ చిన్న విషయం అయినా అభిమానులు ఎలా పండగ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది మెగా హీరోలు అందరూ ఒక్కే వేదికపై కనిపించి సందడి చేస్తే అభిమానులకు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, సరిగ్గా అలాంటి సందర్భం ఇప్పుడు నిహారిక కొణిదెల పెళ్లి ద్వారా వచ్చింది. 

రాజస్థాన్ లోని ఉదయ్ ఘడ్ పాలస్ లో జరుగనున్న నిహారిక కొణిదెల మరియు చైతన్య పెళ్ళికి మెగా హీరోలు అందరూ హాజరు అయ్యారు. 

 

ఇక సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన నిహారిక కొణిదెల ప్రీ వెడ్డింగ్ వేడుకకి సంబందించి ఫొటోలు , వీడియోలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ప్రీ వెడ్డింగ్ వేడుక తర్వాత మెగా కుటుంబికులు నిర్వహించిన సంగీత్ కి సంబందించి వీడియోలు మరియు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ హుళచల్ చేస్తున్నాయి, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా హీరోలందరూ ఈ సంగీత వేడుకలో డాన్స్ వేసి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. ముఖ్యంగా ఘరానా మొగుడు సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ బంగారు కోడి పెట్ట సాంగ్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు డ్యాన్స్ వేశారు. ఈ వయస్సు లో మెగాస్టార్ ఏ మాత్రం గ్రెస్ తగ్గకుండా స్టెప్స్ తో అదరగొట్టేసాడు. చివర్లో చిరు భార్య సురేఖ కూడా కాలు కదపడం కొసమెరుపు. మొత్తంగా నిహారిక పెళ్లిలో మెగా కుటుంబం మొత్తం రచ్చ రచ్చ చేస్తున్నారు.