హనీమూన్ ఫోటోలతో దాడి.. భర్త కౌగిలిలో నిహారిక బంధీ!!

Niharika shares Her Honeymoon Pics

మెగా డాటర్ నిహారిక ఈ మధ్యే తన హనీమూన్‌ను పూర్తి చేసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి, ఆ తరువాత గుళ్లు గోపురాలు తిరగడం, ఆ తరువాత మెగా ఇంట్లో గ్రాండ్‌గా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అందరికీ తెలిసిందే. ఇలా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక నిహారిక , చైతన్యలు హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. అలా ఈ కొత్త జంట అక్కడి వెళ్లడం.. ఇక్కడ మెగా హీరోలు కరోనా బారిన పడటంతో అందరూ ఆందోళన చెందారు.

 

Niharika shares Her Honeymoon Pics
Niharika shares Her Honeymoon Pics

క్రిస్మస్ వేడుకల్లోనే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందిందనే టాక్ బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ కొత్త జంటకు కూడా కరోనా సోకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కానీ నాగబాబు క్లియర్‌గా చెప్పేశాడు. మాల్దీవులకు వెళ్లేటప్పుడు.. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు.. నెగెటివ్ వచ్చిందని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే నిహారిక మాత్రం తమ హనీమూన్ ఫోటోలను ఎక్కువగా షేర్ చేయలేదు.

అక్కడ వారిద్దరూ డైవింగ్ చేశారు.. సముద్రంలో రచ్చ రచ్చ చేశారు. కానీ ఫోటోలను మాత్రం అంతగా బయటకు వదల్లేదు. కానీ ఇప్పుడు నిహారిక తన హనీమూన్ ఫోటోలను షేర్ చేస్తోంది. మత్తెక్కించేలా కంటి చూపుతో చంపేస్తోంది. భర్త కౌగిలిలో బంధీ అయిన నిహారిక ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సముద్రం ఆకాశం కలిసి చోట నన్ను కలవండి.. ఐ సీ (సముద్రం, చూడటం)యూ చై అంటూ రెండు రకాలు అర్థం వచ్చేలా ఫోటోలను షేర్ చేసింది.