గుంటూరు ఐజి ప్రభాకరరావు కుమారుడు చైతన్య ను మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకోబోతుంది. ఆగస్ట్ లో చైతన్యతో నిశ్చితార్ధం జరుపుకోగా, డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసారు.
రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ లో చైతన్య, నిహారికల పెళ్లి జరగబోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఉదయ్ పూర్ కు ప్రత్యేక విమానాలలో వెళ్లడం జరిగింది.
వివాహానికి మొత్తం 120మందిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పెళ్లికి ఆహ్వానించిన సమయంలో అందరికీ పట్టు వస్త్రాలు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వాళ్లందరికీ ఉదయ్ విలా్‌సలోనే బస ఏర్పాటు చేశారు
ఇకపోతే, మెగా డాటర్ నిహారిక దంపతులకు మెగాస్టార్ చిరంజీవి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా నా శుభాకాంక్షలంటూ చిరంజీవి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. చిన్నప్పుడు నిహారికతో దిగిన ఫోటోను ఇప్పుడు నిహారికతో దిగిన సెల్ఫీ పిక్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు చిరంజీవి. నిహారిక పెళ్లి ఉదయ్ పూర్ లో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇక సినీ, రాజకీయ ప్రముఖులు అదేవిధంగా సన్నిహిత వర్గాల కోసం హైదరాబాద్‌లో స్పెషల్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసింది మెగా ఫ్యామిలీ.
సోమవారం రాత్రి జరిగిన సంగీత్ వేడుకలో నిహారిక.. చైతన్యలతో పాటు మెగా కుటుంబ సభ్యులు సందడి చేశారు. కాబోయే వధూవరులు పలు పాటలకు నృత్యాలు చేశారు. ముఖ్యంగా చిరంజీవి నటించిన చిత్రాల్లోని పాటలకు స్టెప్‌లు వేస్తూ తమదైన శైలిలో అలరించారు.