మెగా డాటర్ నిహారిక కొణిదెల గుంటూరు ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నిశ్చితార్థం అయ్యింది. అక్టోబర్ లేదా నవంబర్ లో పెళ్లి జరగనుందని కార్తీక మాసం నాటికి నిఖా ఖాయమైనట్టేనని చెబుతున్నారు. తాజాగా శ్రావణ మాసం ముగింపు వేళ పసుపు దంచే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ విషయాన్ని నిహారిక ఇన్ స్టాలో స్వయంగా వెల్లడించింది. అందుకు సంబంధించిన వీడియోలో మెగా ఇంట ఆడపడుచుల సందడి ఆకట్టుకుంది.
మరోవైపు కథానాయికగా గాయనిగా రాశీ ఖన్నా ప్రజ్ఞ గురించి తెలిసిందే. రాశీ వరుసగా సినిమాల్లో నటిస్తూనే పలు సినిమాల్లో పాటలు పాడి మెప్పించింది. రాశీ ట్యాలెంట్ ను మెచ్చని వాళ్లు లేరు. లాక్ డౌన్ సమయంలో రాశీ ఇదిగో ఇలా గీతాలాపనలో బిజీ అయ్యింది.
ఆ పాటను తనే స్వయంగా ఇన్ స్టా ఫేస్ బుక్ లో షేర్ చేసింది. ఉండి పోరాదే.. అంటూ సాగే సిద్ శ్రీరామ్ పాటను ఆలపించిన రాశీ శహభాష్ అనిపిస్తోంది. ఓవైపు గిటార్ ప్లే చేస్తూ ఆకట్టుకుంది. పాటతోనే తన పయనం ఎంతో ఇష్టం అని చెప్పింది. అన్నట్టు రాశీ ఖన్నా హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనుక్కుని స్థిరపడింది. ఇక్కడ వరుసగా యువహీరోల సినిమాలకు సంతకాలు చేస్తోంది. కానీ స్టార్ హీరోతో కమిట్ మెంట్ (మూవీకి) ఎపుడో చెప్పనే లేదు.