నిహారిక గ్లామర్ హీరోయిన్ పాత్రలు వేస్తుందా?

నిహారిక గ్లామర్ హీరోయిన్ పాత్రలు వేస్తుందా?

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుండి అనేక మంది హీరోలను చూశాం. అయితే ఆ కుటుంబం నుండి సినిమా పరిశ్రమలోకి వచ్చిన మొదటి హీరోయిన్ మాత్రం నిహారిక.

నిహారిక మొదటిగా టీవీ వ్యాఖ్యాతగా కొన్ని షో లకి యాంకర్ గా పని చేసిన తర్వాత నటన మీద ఉన్న ఇష్టంతో తనే ఒక యూట్యూబ్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి కొన్ని వెబ్ సిరీస్లలో  నటించి నిర్మించింది. వాటికి మంచి ఆదరణతో పాటు ప్రశంసలు కూడా దక్కాయి.

ఆ తర్వాత ఒక మనసు చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి హీరోయిన్ గా  ప్రవేశించింది. ఆ చిత్రంలో  రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్ర కాకుండా ఒక సెన్సిబుల్ పాత్ర పోషించింది. ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లో కూడా నిహారిక రెగ్యులర్ గ్లామరస్ హీరోయిన్ పాత్రలు వేయలేదు.

అయితే సోషల్ మీడియాలో  పోస్ట్ చేసిన ఒక చిత్రం చూస్తుంటే తాను హీరోయిన్ పాత్రలకి సిద్ధమనే సంకేతాలు పంపిస్తుంది అనే చర్చ జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో మరి.