20 ఏళ్ల అనుభవం కనిపించింది.. ‘జాంబీరెడ్డి’పై నిహారిక రివ్యూ

Niharika about Zombie reddy Movie

మెగా డాటర్ నిహారిక ఈ మధ్య రివ్యూలు ఇవ్వడం ప్రారంభించింది. ప్రతీ సినిమాను నిహారిక వీక్షిస్తోంది. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తోంది. అయితే తాజాగా జాంబీ రెడ్డి సినిమాను చూసిన నిహారిక తనదైన శైలిలో రివ్యూను ఇచ్చింది. సూపర్ డూపర్ అంటూ జాంబీరెడ్డిపై ప్రశంసలు కురిపించింది. జాంబీలు తెలుగు తెరకు కొత్తేమో గానీ హాలీవుడ్, ఇంగ్లీష్ సినిమాలను చూసే వారికి కొత్త కాదు. కానీ తెలుగులో జాంబీల నేపథ్యంలో తెరకెక్కిన మొదటి సినిమా ఇదే.

Niharika about Zombie reddy Movie
Niharika about Zombie reddy Movie

అలాంటి జాంబీరెడ్డిపై డివైడ్ టాక్ వచ్చింది. రొటీన్ కామెడీ సీన్స్,లాజిక్ లెస్ సీన్స్ అంటూ జాంబీరెడ్డిని ఏకిపారేస్తున్నారు. వాటికి తగ్గట్టు జాంబీరెడ్డి కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా నిహారిక జాంబీరెడ్డి గురించి చెప్పిన మాటలు, చేసిన పోస్ట్ బాగానే వైరల్ అవుతోంది. ఆదివారం రాత్రి నిహారిక జాంబీరెడ్డిని వీక్షించినట్టుంది. ఈ మేరకు ఆమె నిన్న రాత్రి ఓ పోస్ట్ పెట్టేసింది.

ఇప్పుడే జాంబీరెడ్డి సినిమాను చూశాను.. తెలుగులో మొదటి జాంబీ చిత్రం.. అది కూడా సూపర్ ఎంటర్టైన్ చేశారు.. కామెడీ అదిరిపోయింది.. ప్రశాంత్ వర్మ నువ్ చించేశావ్.. హీరోగా మొదటి చిత్రంలో అద్భుతంగా నటించావ్.. నీ 20 ఏళ్ల అనుభవం కనిపించిందంటూ తేజపై సెటైర్లు వేసినట్టు నవ్వేసింది. దక్ష, ఆనంది, గెటప్ శ్రీను, హేమంత్ ఇలా అందరూ కూడా బాగా నటించారు. మార్క్స్ అందించిన సంగీతంతో సినిమా మరో స్థాయికి వెళ్లింది. మేకప్, ప్రోస్థటిక్ డిపార్ట్మెంట్ అదిరిపోయింది. బ్లడీ బ్లాక్ బస్టర్ కొట్టినందుకు జాంబీరెడ్డి టీంకు కంగ్రాట్స్ అంటూ నిహారిక పోస్ట్ చేసింది.