నెటిజనులకు  పిచ్చెక్కిస్తున్న హాట్ బాంబ్

నెటిజనులకు  పిచ్చెక్కిస్తున్న హాట్ బాంబ్ రాయ్‌లక్ష్మి! 

 
హీరోయిన్‌గా నటిస్తూనే, ప్రత్యేక గీతాల్లో నర్తించి ప్రేక్షకులను కట్టిపడేయడంలో రాయ్‌లక్ష్మి స్పెషలిస్ట్. సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటించిన ఈ హాటు భామ హిందీలో ‘జూలీ 2’ సినిమాలో నటించింది. పొరపాటున ఆ సినిమా హిట్టైవుంటే బాలీవుడ్‌ను ఒక ఊపు ఉపేది. ‘జూలీ 2’ వర్కవుట్ కాకపోవడంతో మళ్లీ తనకలవాటైన సౌత్‌కే వచ్చి సినిమాలు చేస్తోంది.
 
ఈ భామ సోషల్ మీడియాలో చిన్నపాటి తుఫానులు సృష్టించడంలో దిట్ట. తన హాట్ అండ్ బోల్డ్ ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తూ తాజాగా బికినీ ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోల్లో ఒకదాన్ని తన ఇన్స్టా అక్కౌట్‌లో నెటిజనులకు షేర్ చేసింది. అయితే జస్ట్ ఫొటో పోస్ట్ చేసి ఊరుకునే రకం కాదు. అందుకే -కాస్త ఫిలాసఫీ టచ్ కూడా ఇచ్చిందట.
 
అందంగా లేనివాళ్లు అందమైన ఫిలాసఫీ చెప్తే నచ్చదు. కానీ అందగత్తె చెప్పే ఫిలాసఫీ ఎందుకోగానీ అందరికీ భలే నచ్చుతుంది. ‘మిమ్మల్ని ఎవరైతే ఎంచుకుంటారో వారిని ఎంచుకోండి…’ ఇది అమ్మడి క్యాప్షన్. అర్థమైందిగా.. మనల్ని పట్టించుకోని వారి వెంటపడి టైమ్ వేస్ట్ చేసుకోకుండా మనల్ని అభిమానించే వారిని, ప్రేమించే వారిని గుర్తించమని డీప్ ఫిలాసఫీని చెప్తోంది రాయ్‌లక్ష్మి.
 
తాజాగా స్విమ్మింగ్‌పూల్ దగ్గర నీటిలో నిలబడి మరీ కెమెరాకు పోజిచ్చింది. సెగలు రేపిన ఫోటోతో నెటిజనులు పిచ్చెక్కుతున్నారట. ఇక రాయ్‌లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో ‘సిండ్రెల్లా’, కన్నడలో ‘ఝాన్సి’ చిత్రాల్లో చేస్తోంది.