Heroines Who Changed Names : పేర్లు మార్చుకున్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లు.!

Heroines Who Changed Names : ముద్దుగుమ్మలకి స్క్రీన్ పేర్లు వేరే వుంటాయ్. ఒరిజినల్ పేర్లు వేరే వుంటాయ్. అది వేరే సంగతి. స్క్రీన్ మీదికొచ్చిన తర్వాత కూడా కొందరు ముద్దుగుమ్మలు పేర్లు మార్చుకుంటుంటారు. తద్వారా వాళ్ల లక్కు మారుతుంని భావిస్తుంటారు.
అలా మార్చుకున్న పేర్ల ద్వారా, ఆయా ముద్దుగుమ్మలు సక్సెస్ అయ్యారా.? లేదా.? అలాంటి ముద్దుగుమల్లో కొందరి లిస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం.
ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్
‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమా ద్వారా హీరోయిన్‌గా డెబ్యూ చేసింది లక్ష్మీరాయ్. కానీ, హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయింది. తర్వాత పేరు మార్చుకుంది రాయ్ లక్ష్మిగా. అయినా గానీ అమ్మడిని హీరోయిన్‌గా ఆదరించలేకపోయారు ఆడియన్స్. కానీ, ఐటెం గాళ్‌గా రాయ్ లక్ష్మి బాగా సక్సెస్ అయ్యింది.
వేద అలియాస్ అర్చన
అర్చన పేరుతో పదహారణాల తెలుగమ్మాయ్ తెలుగు తెరపై అడుగు పెట్టింది. హీరోయిన్‌గా మొదట్లో కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత ‘వేద’గా పేరు మార్చుకుంది. అలాక్కూడా అమ్మడికి లక్కు చిక్కలేదు. కొన్ని టీవీ షోలు, సీరియల్స్, అడపా దడపా కొన్ని సినిమాలతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో బిజీగా గడుపుతోంది వేద అలియాస్ అర్చన.
‘ఆనందం’ బ్యూటీ రేఖ
‘ఆనందం’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన బక్క సుందరి రేఖ గుర్తుంది కదా. తొలి సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది కానీ, హీరోయిన్‌గా రేఖ మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని కొన్ని స్పెషల్ సాంగ్స్‌లో నటించింది. ఈ గ్యాప్‌లో తన పేరు ‘అక్షర’గా మార్చుకుంటున్నట్లు రేఖ అనౌన్స్ చేసింది. పేరు మారిందే కానీ, ఆ తర్వాత కూడా రేఖ, తెలుగు తెరపై పెద్దగా కనిపించలేదు.
పవన్ హీరోయిన్ మీరా చోప్రా
మీరా చోప్రా అసలు పేరు నిలా చోప్రా. పవన్ కళ్యాణ్‌తో ‘బంగారం’ సినిమాలో నటించింది. ఆ తర్వాత నితిన్ సినిమాలోనూ నటించింది. కానీ, కెరీర్‌లో విజయాల కన్నా, వివాదాలతోనే  ఈ అమ్మడు ఎక్కువగా సావాసం చేసింది. హీరోయిన్‌గా కెరీర్‌ నిలబెట్టుకోలేకపోయింది. టాలీవుడ్‌తో పాటు, బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లో నటించింది మీరా చోప్రా.  కానీ, అవి కూడా అరకొరా సినిమాల లిస్టులోకే చేరిపోయాయ్.
వీళ్లే కాదు, చాలా మంది అందాల భామలు ఒరిజినల్ నేమ్స్‌ని స్క్రీన్ కోసం మార్చుకోవడం, సక్సెస్ కోసం ఆ స్క్రీన్ నేమ్‌ని మళ్లీ మార్చుకోవడం చేశారు. కానీ, సక్సెస్‌లో మాత్రం ఎలాంటి మార్పునూ చూడలేకపోయారు పాపం ఆయా ముద్దుగుమ్మలు.