బాలయ్య పుట్టినరోజు.. చిరు ఏంటి అలా అనేశారు!
గత కొద్దిరోజులుగా మెగా వర్సెస్ నందమూరి ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. దర్శకరత్న డా.దాసరి నారాయణరావు తర్వాత మెగాస్టార్ చిరంజీవి పరిశ్రమ పెద్దన్నగా కీరోల్ పోషించడం కొందరికి కంటగింపుగా మారిందన్న చర్చా టాలీవుడ్ లో సాగుతోంది. అదే క్రమంలో పరిశ్రమ సమస్యల్ని వినిపించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ని .. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని మెగాస్టార్ సహా సినీపెద్దలు కలిసారు. షూటింగుల అనుమతులు సహా పలు అంశాలపై పరిష్కారం కనుగొన్నారు. దీనిపై ఇండస్ట్రీలో హార్షం వ్యక్తమైంది. అయితే ఈ ఎపిసోడ్లపై నందమూరి బాలకృష్ణ అంత సంతృప్తిగా లేరని ప్రచారమవుతోంది. అందుకే ఆయన మీడియా ముఖంగా చిరుపై ఊహించని కామెంట్లు చేశారు. తనను మీటింగులకు ఆహ్వానించలేదని సీరియస్ అయ్యారు.
అయితే వీటిపై మెగాస్టార్ చిరంజీవి ఎంతమాత్రం స్పందించలేదు. సరికదా.. ఇప్పటికీ బాలయ్యను తన సోదరుడిగానే భావిస్తూ ఆయన ఇండస్ట్రీ వ్యవహారాల్లోకి సాదరస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారట. జూన్ 9న ఏపీ సీఎం జగన్ తో భేటీకి బాలయ్యను ఆహ్వానించారు. కానీ పుట్టినరోజు వేడుకలు అంటూ ఆయన స్కిప్ కొట్టడం తెలిసిందే.
ఇకపోతే నేడు బాలయ్య 60వ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతున్నారు.. ఇలాంటి వేళ చిరంజీవి విష్ చేస్తారా? స్పందన ఎలా ఉంటుందో! అంటూ ఓ సెక్షన్ రకరకాల సందేహాలు వ్యక్తం చేశారు. కానీ చిరు తన పెద్దరికాన్ని మరోసారి నిలుపుకున్నారు. వ్యక్తిత్వంలో తాను ఆకాశం ఎత్తు అని నిరూపించారు. ట్విట్టర్ సాక్షిగా బాలయ్యకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపి పెద్ద మనసు చాటుకున్నారు.
“60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో , ఉత్తేజంతో
ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. డియర్ #NBK మ్యాజికల్ 60 కి కీలక మలుపు. మీ పయనం అసాధారణమైనది. హ్యాపీ బర్త్ డే“ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.
నిజానికి బాలయ్య కామెంట్ చేసినా చిరంజీవి అస్సలు పట్టించుకోలేదని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ బాలయ్యపై కొణిదెల కాంపౌండ్ కి వ్యతిరేకత లేదని చిరు స్పందన తెలియజేస్తోంది. ఆయన స్వభావం ముక్కుసూటితనం గురించి తెలుసు కాబట్టి..క్షణికావేశంలో పొరపాటు అని లైట్ తీస్కున్నారట.
ఇండస్ట్రీ వ్యవహారాల్లో ఇకపై బాలయ్య ను కలుపుకుని వెళ్లే ఆలోచనలోనే మెగా కాంపౌండ్ ఉందని తెలుస్తోంది. అయితే ఒక సెక్షన్ మీడియా మాత్రం చిరంజీవి – బాలయ్య మధ్య విబేధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్న లీక్ ఇరు హీరోల ఫ్యాన్స్ లో వేడెక్కిస్తోంది.
60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో
ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను.Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey.Happy birthday— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2020