అవును.. అని అంటోంది చిత్రసీమ. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యమిచ్చినా గత కొన్నేళ్లుగా గ్లామర్ షో కాస్త తగ్గింఛి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసుకుంటూ వెళుతోంది దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార. గత పన్నెండేళ్లకు పైగా సినిమాలు చేస్తూ వివిధ పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ సినిమా జీవితం విజయవంతంగా కొనసాగుతున్నా, పర్సనల్ లైఫ్ మాత్రం అంత ఆశాజనకంగా లేదు. లవ్‌లో రెండుసార్లు ఫెయిల్ అయింది. దాంతో సక్సెస్‌ఫుల్‌గా సాగుతుందనుకున్నలవ్ లైఫ్ కు బ్రేకులు పడ్డాయి.
తొలుత ఓ హీరోని వదులు కొని..ఆ తర్వాత పెళ్లి పీటలెక్కే ముందు ఓ కొరియోగ్రాఫర్‌ను పక్కన పెట్టేసింది. ఆ తర్వాత నయన్ జీవితంలోకి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ వచ్చాడు. ‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య చిగురించిన ప్రేమ పరవళ్లు తొక్కింది. చెట్టా పట్టాలేసుకొని వీళ్ళిద్దరూ ప్రేమలో మునిగి తేలారు. ‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమాకి ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకుడు. వీరిద్దరూ త్వరలోనే తమిళనాడులోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకోనున్నట్లు గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయ్. ఇదంతా గతం.
ఇప్పుడు తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో గుప్పుమంటోంది. నయనతార వ్యక్తిగత జీవితం గురించి ఆమె సన్నిహితులే చర్చించుకుంటున్నారు. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కు నయనతార దూరమవుతోందని, ఆమె లవ్ లైఫ్ కు మళ్లీ బ్రేకులు పడుతున్నాయని చెప్పుకుంటున్నారు. కారణాలు పక్కనపెడితే ఈ మధ్య వీరిద్దరూ అప్పట్లాగా కలవడం లేదని, ప్రేమకు పెళ్లితో ఫుల్ స్టాప్ పెడతారనుకుంటున్నసమయంలో ఈ తాజా వార్త అందర్నీ ఆలోచనలో పడేసింది.