బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న నయనతార…

సౌత్ లో లేడి ఓరియంటెడ్ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. అలా వచ్చినా హిట్ కావడం చాలా తక్కువ. ఒకవేళ హిట్ అయితే వసూళ్లు అంతంత మాత్రంగానే ఉంటాయి. పూర్వం విజయశాంతి స్వింగ్ లో ఉన్నపుడు స్టార్ హీరోలకు దీటుగా లేడి ఓరియంటెడ్ సినిమాలు వచ్చాయి. ఆయా సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. తరువాత కాలంలో హీరోల సినిమాలకు డిమాండ్ పెరగడంతో లేడి ఓరియంటెడ్ సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు రాలేదు.

 

నయనతార మెయిన్ లీడ్ రోల్ చేస్తూ ఇటీవలే కొలమావు కోకిల అనే సినిమా రిలీజ్ అయింది. విడుదలైన 9 రోజుల్లోనే రూ.20 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసి రికార్డు సృష్టించింది. సౌత్ లో ఏ లేడి ఓరియంటెడ్ సినిమా కూడా ఇంతటి వసూళ్లు సాధించలేదు. కోలమవు కోకిల సినిమాను కోకో కోకిల పేరుతో ఆగష్టు 31వ తేదీన తెలుగులో విడుదల చేయబోతున్నారు. మరి తెలుగులో నయనతార ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.