Home Tollywood అల్లు అర్జున్ చిత్రంలో నవదీప్ షాకింగ్ క్యారక్టర్

అల్లు అర్జున్ చిత్రంలో నవదీప్ షాకింగ్ క్యారక్టర్

అల్లు అర్జున్ చిత్రంలో నవదీప్ షాకింగ్ క్యారక్టర్

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో రూపొందిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నవదీప్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఇందుకోసం ఆయన జిమ్ కు వెళ్లి మరీ కష్టపడుతున్నారు. ఆ ఫొటోని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసారు నవదీప్.

తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ కొత్త ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఆయన జిమ్ లో రెడీ చేసిన బాడీతో కనిపించారు. ఇప్పటి వరకు నవదీప్‌ను ఇలాంటి లుక్‌లో చూడకపోవటంతో ప్రశంసల వర్షం కురుస్తోంది. తాను ఈ విధంగా తయారవడానికి జిమ్ కోచ్ కృష్ణ సద్వాలే కారణమని నవదీప్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు. ఈ విషయంలో అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా దగ్గుబాటి, వివన్ భతేనా(‘రాజా ది గ్రేట్’ విలన్) తనకు ఎప్పుడూ స్ఫూర్తి అని నవదీప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో నవదీప్ ది నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. ఆ పాత్ర చాలా షాకింగ్ గా ఉంటుందని చెప్తున్నారు. క్యారక్టర్ లో కొద్దిగా సైకో లక్షణాలు ఉంటాయని చెప్తున్నారు. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఆ పాత్ర అసలు రూపం రివీల్ అవుతుందిట. నవదీప్ కు తిరిగి లైఫ్ ఇచ్చే క్యారక్టర్ అవుతుందని నమ్మి కష్టపడి చేస్తున్నారు. అల్లు అర్జున్ తెలుగు కోసం ఈ యంగ్ విలన్ ని రెడీ చేస్తున్నారట.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఏఏ19గా వ్యవహరిస్తున్నారు. . ఈ సినిమాలో ఇప్పటికే హీరో సుశాంత్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ నటి టబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. పూజా హెగ్డే, నివేతా పేతురాజ్ హీరోయిన్లు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

- Advertisement -

Related Posts

బన్నీ “పుష్ప” రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే ?

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ త్వరలో తన అభిమానులను థియేటర్లలో కలవబోతున్నాడు. తన పుష్ప సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించాడు. సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. రష్మికా మందన్న...

ప్రభాస్ సరసన శృతిహాసన్ .. క్లారిటీ ఇచ్చిన సలార్ చిత్ర యూనిట్ !

లోకనాయకుడు కుమార్తె , స్టార్ హీరోయిన్ శృతిహాసన్ మరో బంపర్ ఆఫర్ అందుకుంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సరసన నటించిన శృతిహాసన్ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే...

ఎవ్వరూ చూడని ఫోటో అడిగిన నెటిజన్.. అలా షాకిచ్చిన సురేఖా వాణి కూతురు

నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో ఎంత అల్లరి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. సురేఖా వాణి, సుప్రిత కలిసి వేసే టూర్లు, వీకెండ్‌లో చేసుకునే పార్టీలు సోషల్ మీడియాలో...

అందాల రాక్షసి.. పెదాలు కొరికిందా?

అందాల రాక్షసి అనగానే అందరికి గుర్తొచ్చే పేరు లావణ్య త్రిపాఠి. గత కొంత కాలంగా అమ్మడు పెద్దగా సక్సెస్ అందుకోవడం లేదు. చివరగా చేసిన అర్జున్ సురవరం సినిమా పరవాలేధనిపించే విధంగా మెప్పించింది....

Latest News