`@నర్తనశాల`తో మరో ఉత్తరాది భామ తెలుగునాట అడుగుపెడుతోంది. ఆ భామ పేరు కష్మీరా పరదేశీ. పరదేశీ ఏంటండీ అని అడిగితే `మేం రాజ్‌పుత్‌లం` అని సమాధానమిస్తోంది. ఈ భామ హైదరాబాద్‌లో అడుగుపెట్టగానే @నర్తనశాల దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి ఆమెను నవరసాలను అభినయించమని అన్నారట. ఆ విశేషాలను ఇంటర్వ్యూలో చెప్పింది కష్మీరా పరదేశీ. ఆమెతో ఇంటర్వ్యూ విశేషాలు…
* చెప్పండి.. మీ గురించి?
– మాది పుణె. నేను ముంబైలో ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ చేశా. థియేటర్స్ చేశా. అక్కడి నుంచి మోడలింగ్‌కి వెళ్లా. నేను కాలేజీలో ఉన్నప్పుడే సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ అప్పుడు వద్దనుకున్నాను. ఇప్పుడు కావాలనుకుని తెలుగు సినిమా చేస్తున్నా.
* తెలుగు భాష ఉందని మీకు ముందే తెలుసా?
– తెలుగు, తమిళ్ ఇప్పుడు ముంబైలో ఫేమస్. ఇక్కడి సినిమాల అనువాదాలన్నిటినీ మేం అక్కడ చూస్తుంటాం. ఇక్కడ ఒక్క సినిమాలో వేరియస్ ఎమోషన్స్ ని పండిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రేముకో ఎమోషన్ అన్నమాట.
* మీకు బాగా నచ్చేదేంటి?
– అల్లుఅర్జున్, మహేష్, చిరంజీవి సినిమాలు ఇష్టం.
* మీకు డ్యాన్స్ ఇష్టమేమో?
– కథక్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. అందులో అభినయ అని ఒక విభాగం ఉంటుంది. దాని వల్ల నాకు నటన మీద ఇష్టం పెరిగింది.
* @నర్తనశాల గురించి చెప్పమంటే?
– ఇందులో వేరియస్ వేరియేషన్స్ ఉంటాయి. అందుకే నన్ను దర్శకుడు నవరసాలను చేసి చూపించమన్నారు.
* మీరు ఏ రసాన్ని బాగా పండించగలరు?
– శృంగార్… ఇందులో నేను సూపర్.
* ఈ సినిమా కాస్ట్యూమ్స్ సంగతేంటి మరి?
– ఎక్కడా నేను ఇబ్బంది పడకుండా కంఫర్టబుల్‌గా ఉండేలానే ఉన్నాను. అందుకు నిర్మాత ఉషగారు ఎంతో సాయం చేశారు. నాగశౌర్య స్వీట్ పర్సన్.