`గూఢ‌చారి`కి లోకేష్ ప్ర‌శంస‌

                                                             (ధ్యాన్)

అడివిశేష్ హీరోగా న‌టించిన స్పై థ్రిల్ల‌ర్ `గూఢ‌చారి`.. ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుని విజ‌య‌వంతంగా సాగిపోతుంది. శ‌శికిర‌ణ్ తిక్క ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌గా.. అభిషేక్ పిక్చ‌ర్స్‌పై అభిషేక్ నామా సినిమాను నిర్మించారు. ఈ సినిమాను రీసెంట్‌గా వీక్షించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, పంచాయితీ రాజ్‌, రూర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్  మినిష్ట‌ర్ నారా లోకేష్ సినిమాను ఆసాంతం ఎంజాయ్ చేశాన‌ని మెచ్చుకుంటూ ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈ అప్రిషియేష‌న్‌కి లైన్ ప్రొడ్యూస‌ర్ వివేక్ కూచిబొట్ల నారా లోకేష్‌కి థాంక్స్ చెప్పారు.