ఆగ‌స్ట్ 24న జ‌గ‌ప‌తిబాబు, నారా రోహిత్ ‘ఆట‌గాళ్లు’

నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబు హీరోలుగా తెర‌కెక్కుతోన్న సినిమా ఆట‌గాళ్లు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 24న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ప‌రుచూరి ముర‌ళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్ష‌న బానిక్ ఈ చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీకి హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది చిత్ర‌యూనిట్. 

ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ప‌రుచూరి ముర‌ళి. అందుకే ట్యాగ్ లైన్ కూడా గేమ్ ఆఫ్ లైఫ్ అని పెట్టారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్.. ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పందన వ‌చ్చింది. నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబుపై వ‌చ్చే ప్ర‌తీ స‌న్నివేశం కూడా సినిమాలో హైలైట్ గా నిల‌వ‌నుంది. సాయికార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విజ‌య్ సి కుమార్ సినిమాటోగ్ర‌ఫీ ఆట‌గాళ్లు చిత్రానికి మ‌రో మేజ‌ర్ హైలైట్. 

 

న‌టీన‌టులు: 

నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబు, బ్ర‌హ్మానందం, ద‌ర్ష‌న బానిక్ త‌దిత‌రులు

 

టెక్నిక‌ల్ టీం:

ద‌ర్శ‌కుడు: ప‌రుచూరి ముర‌ళి

నిర్మాత‌లు: వాసిరెడ్డి ర‌వీంద్ర‌నాథ్, వాసిరెడ్డి శివాజీ ప్ర‌సాద్, రాము మ‌క్కెన‌, వ‌డ్ల‌పూడి జితేంద్ర‌

బ్యాన‌ర్: ఫ‌్రెండ్స్ అండ్ క్రియేష‌న్స్

సంగీతం: సాయికార్తిక్

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్ సి కుమార్ 

విడుద‌ల తేదీ: ఆగ‌స్ట్ 24, 2018