పండుగ రోజు అన్న ఎన్టీఆర్ ను ఏడిపించిన నారా బ్రాహ్మణి

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “అరవింద సమేత వీర రాఘవ” బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాన్ బాహుబలి రికార్డులను తుడిపేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంపై కొందరు అభిమానులు అసంతృప్తిని వ్యక్తపరిచినప్పటికీ సినిమాలోని మైనస్ పాయింట్స్ ను ఎన్టీఆర్ నటన డామినేట్ చేసిందంటూ కొందరు కితాబిస్తున్నారు.

కాగా అరవింద సమేత వీర రాఘవ సినిమా చూసిన ఎన్టీఆర్ సోదరి నారా బ్రాహ్మణి అన్నపై ప్రశంసల వర్షం కురిపించింది. అంతే కాకుండా విజయదశమి సందర్భంగా అన్న ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక సర్ప్రైజ్ కానుకను పంపింది. బ్రాహ్మణి పంపిన కానుక చూసి ఎన్టీఆర్ ఉద్వేగానికి లోనయ్యారు. హరికృష్ణ జ్ఞాపకాలను గుర్తు చేసే ఆ కానుక చూసి ఎన్టీఆర్ కంట తడి పెట్టుకున్నారట. ఇంతకీ నారా బ్రాహ్మణి పంపిన ఆ కానుక ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే కింద చదవండి.

నందమూరి హరికృష్ణ పథ ఫోటోలను సేకరించి వాటిని ఆల్బమ్ గా తయారు చేయించి ఒక సీడీ రూపంలో అన్న ఎన్టీఆర్ కు గిఫ్ట్ పంపింది. ఆ సీడీ లో తన తండ్రి రేర్ కలెక్షన్ ఫోటోలను చూసిన ఎన్టీఆర్ ఉద్వేగానికి లోనయ్యారు. దసరా సందర్భంగా తన తండ్రి అరుదైన జ్ఞాపకాలను గుర్తు చేసిన తన చెల్లి నారా బ్రాహ్మణికి ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవలే హరికృష్ణ నల్గొండలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. హరికృష్ణ మరణం ఆయన కుటుంబానికి, అభిమానులకి తీరని లోటును మిగిల్చింది. అరవింద సమేత సినిమా షూటింగ్ టైం లోనే హరికృష్ణ మరణించారు. ఆ దుఃఖాన్ని దిగమింగుకుని నిర్మాతలకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ తండ్రి మరణించిన మూడు రోజులకే షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమాని తన సోదరుడు జానకి రామ్, తండ్రి హరికృష్ణకు అంకితమిచ్చారు అరవింద సమేత మూవీ యూనిట్.