వేశ్యగా మారిన యంగ్ హీరోయిన్!

Nandini Rai In Metro Kathalu Movie

అవును ఓ యంగ్ హీరోయిన్ వేశ్యగా మారింది. అయితే అది నిజ జీవితంలో మాత్రం కాదు. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫాం హవా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీకి సరిపోయే కథలు, కథనాలతో కొత్త దర్శకులు, నిర్మాతలు పోటీ పడి ఓటీటీలోకి దూకేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో అల్లు అరవింద్ తన సొంత ఓటీటీ యాప్ ఆహాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో కథలు, దర్శకులను జల్లెడ పట్టి మరి కొత్త కాన్సెప్ట్‌లను వెతికి పడుతున్నారు.

Nandini Rai In Metro Kathalu Movie

అందులో భాగంగా మెట్రో కథలు అనే కొత్త సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్ తాజాగా విడదుల చేశారు. ఇక టీజర్‌లో ఎలాంటి డైలాగ్స్ పెట్టకుండానే ఎన్నో ఎమోషన్స్‌ను చూపించారు. మెట్రో సిటీలో ఓ నలుగురి జీవితాలకు సంబంధించిన కథలే ఈ సినిమా వృత్తాంతం. రాజీవ్ కనకాల, సన, తిరువీర్, నందినీ రాయ్ నటించారు. నందినీ రాయ్.. పలు భాషల్లో హీరోయిన్‌గా నటించినా కానీ ఎక్కువగా పాపులర్ కాలేదు. కానీ బిగ్ బాస్ రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి బాగానే ఫేమస్ అయింది.

Nandini Rai In Metro Kathalu Movie

బిగ్ బాస్ హౌస్ ద్వారా నందినీకి మంచి గుర్తింపు వచ్చింది. అయితే అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. ఆ మధ్య టాలీవుడ్, క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆమె మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చింది. మళ్లీ మెట్రో కథలు టీజర్‌తో నందినీ రాయ్ హల్చల్ చేస్తోంది. ఇందులో నందినీ రాయ్ హైటెక్ వ్యభిచారం చేసే అమ్మాయి పాత్రల్లో నటిస్తున్నట్టు కనిపిస్తోంది. హద్దు మీరి శృంగార సన్నివేశాల్లో నటించినట్టు టీజర్‌లో కనిపిస్తోంది. మరి ఈ చిత్రంతోనైనా నందినీకి పేరు వస్తుందో లేదో చూడాలి.