‘118’ ట్రైలర్ టాక్ : వెధవ క్యూరియాసిటీ

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ దర్శకత్వం వహించిన చిత్రం 118 . ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌ను చూస్తే, సినిమాను క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. గతంలో కల్యాణ్‌రామ్‌ ఎప్పుడూ చేయని సరికొత్త పాత్రలో కనిపించారు. షాలిని పాండే, నివేదా థామస్‌ హీరోయిన్స్.

ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియురాలు షాలిని పాండే పక్కనే ఉన్నా కనిపించకుండా పోయిన నివేదా థామస్ కోసమే అతని అన్వేషణ సాగుతూ ఓ హాలీవుడ్ చిత్రం ట్రైలర్ చూసిన ఫీలింగ్ తీసుకొచ్చింది. మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

https://www.youtube.com/watch?time_continue=1&v=KypNI5ug4vk

‘ఆమె చూపు.. ఆమె ముఖం.. ఆ అమ్మాయి ఉండి ఉంటుందా?’ అంటూ కల్యాణ్‌రామ్‌ అడగడం.. ఆమె కోసం వెతకడం ఆద్యంతం ఉత్కంఠను కలిగిస్తోంది. మరి ఆయన ఎవరి కోసం వెతుకుతున్నారు? అసలు ఆ అమ్మాయి ఉందా? తెలియాలంటే ‘118’ చూడాల్సిందే. ‘స్టార్ట్‌ చేసింది ఏదైనా సగంలో ఆపాలంటే చిన్నప్పటి నుంచి నాకు చెడ్డ చికాకు.. ఏంటో వెధవ క్యూరియాసిటీ’ అంటున్నారు కల్యాణ్‌రామ్‌.

నివేదా ఎవరు తాను హత్య చేయబడిందా తనకు కళ్యాణ్ రామ్ కు సంబంధం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం 118. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేష్‌ ఎస్‌ కోనేరు నిర్మిస్తున్నారు. శేఖర్‌ చంద్ర స్వరాలు సమకూరుస్తున్నారు.