(ధ్యాన్)
చుట్టుపక్కలకు తల తిప్పి చూడాలేగానీ, చుట్టూ ఉన్న నలుగురిలో ముగ్గురికి ఓ వ్యాధి ఉన్న విషయాన్ని గమనించవచ్చు. అదే డిజీస్ నానికి కూడా ఉందని అన్నారు నాగార్జున. నాని, నాగార్జున కలిసి చేసిన `దేవదాస్` త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని గురించి నాగార్జున మాట్లాడారు. `అలా మొదలైంది`, `ఎవడే సుబ్రమణ్యం`, `నిన్నుకోరి`, `మజ్ను` ఇలా పలు సినిమాలు నాని నటించినవి చూశాను. `ఈగ`, `ఎంసీఏ` కూడా చూశాను. నాకు రియలిస్టిక్ సినిమాలు నచ్చవు. లార్జర్‌దేన్ లైఫ్ ఉన్న సినిమాలంటేనే ఇష్టం. అందుకే నేను అలాంటి సినిమాలను ఇష్టపడతాను. నాని సినిమాలు రియాలిటీకి దగ్గరగా ఉంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ తో బావుంటాయి. అతని సినిమాలను చూడ్డానికి ఇష్టపడతాను. అతను నాకు పర్సనల్‌గా తెలియదు. సెట్లో మాత్రం బావుంటాడు. షాట్ ఉన్నప్పుడు చేసేస్తాడు కానీ, మిగిలిన సమయం అంతా ఆయన సెల్‌ఫోన్‌తో బిజీగా ఉంటాడు. నిద్రలో కూడా సెల్‌ను చెవికి కట్టుకుంటాడేమో. అది డిజీస్ అని చెప్పాను. ఓవర్ కమ్ కాలేకపోతున్నట్టు చెప్పాడు. నానికి ఉన్న ఆ డిజీస్ నాకు లేదు. మా పిల్లలకు కూడా లేదు. ఆ వ్యాధి ఉన్నవాళ్లను ఎయిర్‌పోర్టులోనూ చాలా మందిని చూస్తుంటాను“ అని అన్నారు నాగార్జున.